వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకు చుక్కెదురు.. సొంత నియోజకవర్గంలో నిరసన సెగలు..

|
Google Oneindia TeluguNews

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఓట్ల కోసం నానా పాట్లు పడుతున్నారు. అయితే ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో కొందరికి చుక్కెదురవుతోంది. తమ సమస్యలు పట్టించుకోకుండా ఇన్నాళ్లు ఎక్కడిపోయారంటూ నేతలను నిలదీస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకు తన సొంత నియోజకవర్గంలోనే చేదుఅనుభవం ఎదురైంది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతను చవిచూల్సివచ్చింది.

సిరాతులో కేశవ్ ప్రసాద్ మౌర్యకు చేదుఅనుభవం.

యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యకు తన సొంత నియోజవర్గం సిరాతులో చుక్కెదురైంది. అంబ్లీ ఎన్నికల్లో భాగంగా గులామిపూర్ గ్రామంలో మౌర్య ప్రచారాన్ని ప్రారంభించారు. అయితే స్థానిక ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రభుత్వతీరుపై నిరసన తెలిపారు. జిల్లా పంచాయతీ సభ్యురాలు భర్త రాజీవ్ మౌర్య గత వారం రోజులుగా కన్పించకుండా పోయారు. ప్రచారంలో భాగంగా రాజీవ్ మౌర్య కుటుంబాన్ని పరామర్శించడానికి వారి ఇంటికి వెళ్లారు. ఈసమయంలో స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అయింది.

మొహం మీదే తలుపులు వేసిన మహిళలు

మొహం మీదే తలుపులు వేసిన మహిళలు

డిప్యూటీ సీఎం ఇంటికి రాగానే ఆయన మొహం మీదే తలుపులు మూసివేశారు. ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిశబ్దంగా ఉండాలంటూ ప్రజలను మౌర్య కోరారు. స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుండడంతో ఆయన అక్కడ నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Recommended Video

UP Elections 2022 : Yogi Adityanath Vs Bhim Army Chief Chandrashekhar Azad | Oneindia Telugu
3మౌర్యపై ఎస్పీ విమర్శలు

3మౌర్యపై ఎస్పీ విమర్శలు

అసలు విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం మౌర్య .. కనిపించకుండా పోయిన రాజీవ్ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశించారు. స్థానిక ప్రజల నుంచి వ్యక్తమైన నిరసనపై విపక్షాలు తీవ్రంగా స్పందించాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పట్ల, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య పట్ల ప్రజల అసంతృప్తిని తెలియజేస్తుందని సమాజ్ వాదీ పార్టీ నేతలు వీడియోను ట్విట్ చేశారు. అయితే దీనిపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజేశ్​ మౌర్య కేసులో పోలీసుల వ్యవహరించిన తీరుకు వ్యతిరేకంగా స్థానికులు నిరసన చేయడం వల్లే ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. . విపక్షాలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడుతున్నారు.

English summary
UP Polls 2022: Deputy CM Keshav Prasad Maura Campaign Stopped in his own constituency
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X