డీజీపీ సాహసం: టేజర్‌గన్‌ను తనపైనే పరీక్షించుకున్నారు(వీడియో)

లక్నో: ఆయన సాక్షాత్తు రాష్ట్రంలోని పోలీసులందరికీ బాస్. అలాంటి వ్యక్తి..

చిన్నపాటి విద్యుత్‌షాక్‌ నిచ్చి....లక్షిత వ్యక్తిని తాత్కాలికంగా కదల్లేని పరిస్థితికి చేర్చే 'టేజర్‌గన్‌'ను తనపైనే ప్రయోగించుకున్నారు. ఆయనే ఉత్తరప్రదేశ్ డిజిపి జావేద్‌ అహ్మద్‌.

కాగా, యూపీ పోలీసు దళాల సారథిగా ఆయన తనపై తాను ఆదివారం చేసుకున్న ఈ ప్రయోగాత్మక యత్నాన్ని వీడియో తీశారు. సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడా వీడియో సంచలనం సృష్టిస్తోంది.

UP DGP takes Taser shot on self during demo

టేజర్‌గన్‌తో కాల్చుకోగానే చిన్నబాణం ములుకులాంటి ఎలక్ట్రోడ్‌ లక్షిత వ్యక్తిని తాకుతుంది. దాని నుంచి వెలువడే ఓ మోస్తరు విద్యుత్‌షాక్‌ ప్రభావంతో ఆ వ్యక్తి స్వల్పకాలంపాటూ నాడీకండర అచేతనావస్థకు గురౌతాడు. దీంతో, ఎటు కదలలేని నిశ్చల స్థితిలో పడతాడు.

ఈ ప్రభావం కేవలం స్వల్పకాలం పాటు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఆ వ్యక్తి మామూలుగా అయిపోతారు. డీజీపీ జావేద్‌ అహ్మద్‌ కూడా సరిగ్గా ఇదే తరహా అచేతనావస్థకు గురై కాసేపటికి సాధారణస్థితికి చేరుకున్నారు. ఆయన తనపై తాను చేసుకున్న ఈ ప్రయోగాన్ని సంబంధిత ఐపీఎస్‌ సంఘం సోషల్ మీడియాలో ప్రశంసించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+