యువతిపై గ్యాంగ్‌రేప్: నిందితుల్లో డిఆర్‌డిఏ ప్రాజెక్ట్ డైరెక్ట్
లక్నో: ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అత్యాచారానికి పాల్పడిన నిందితులలో డిఆర్‌డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ కూడా ఉండటం గమనార్హం. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్ ప్రాంతం షామిలిలోని ప్రభుత్వ కార్యాలయంలో రెండు నెల క్రితం జరిగింది.

బాధితురాలు రాష్ట్ర మహిళ కమిషన్‌ను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నిందితులను అరెస్ట్ చేసేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని బాధిత యువతి కమిషన్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ ఘటనపై విచారణ జరిపిన కమిషన్ నిందితులపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.
ఈ నేపథ్యంలో బుధవారం నిందితులు డీఆర్‌డిఏ(డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్‌మెంట్ అథారిటీ) ప్రాజెక్ట్ డైరెక్టర్ జ్ఞాన్ ప్రకాశ్,అసిస్టెంట్ ఇంజినీర్ దినేష్ కుమార్,గుమస్తాలు రాజ్ కుమార్,ఆనంద్ లపై కేసు నమోదు చేసినట్లు అడిషనల్ ఎస్పి వికె మిశ్రా వెల్లడించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మిశ్రా వివరించారు.












Click it and Unblock the Notifications