యూపీ ఎన్నికలు-2019 'లీడర్': మోడీ ప్రజాదరణ, షా లీడర్‌షిప్

ఎగ్జిట్ పోల్ సర్వేల ఫలితాలు బీజేపీలో ఉత్సాహాన్ని నింపాయి. శనివారం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. యూపీ, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్‌లలో బీజేపీకి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.

లక్నో: ఎగ్జిట్ పోల్ సర్వేల ఫలితాలు బీజేపీలో ఉత్సాహాన్ని నింపాయి. శనివారం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. యూపీ, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్‌లలో బీజేపీకి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.

ఫలితాలు కూడా అలాగే ఉంటాయని బీజేపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేలలో నాలుగు రాష్ట్రాల్లో ఫలితాలు తమ పార్టీకే అనుకూలంగా ఉంటాయని రావటంతో కమలనాధుల్లో ఎంతో ఉత్సాహం కనిపిస్తోంది.

యూపీ అసెంబ్లీలో మూడింట రెండొంతుల ఆధిక్యం సాధిస్తామని భరోసా వ్యక్తం చేశాయి. అత్యంత కీలకంగా భావిస్తున్న యూపీ ఫలితాలు ప్రధాని నరేంద్ర మోడీ ప్రజాదరణకు, ఆయన చేపట్టిన సంస్కరణల పట్ల ప్రజల మద్దతుకు అద్దంపడుతాయని భావిస్తున్నారు.

UP Election Result 2017: PM Modi to emerge stronger by 2019 Lok Sabha polls

పార్టీ అధ్యక్షులు అమిత్‌ షా నాయకత్వ ప్రతిభకు యూపీ ఎన్నికలూ గీటురాయిగా నిలుస్తాయంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో లభించే సానుకూల ఫలితాలు రాజ్యసభలో పార్టీ బలాన్ని పెంచుతాయి.

అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో శనివారం సాయంత్రం ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుంది. అప్పటికి కీలకమైన యూపీ సహా మిగిలిన నాలుగు రాష్ట్రాల ఫలితాలు వెల్లడవుతాయి కనుక పరిస్థితిని సమీక్షించి ఆ తదుపరి అనుసరించాల్సిన వ్యూహాలను ఖరారు చేయనున్నారు.

ముఖ్యమంత్రి అభ్యర్థులపై నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ శనివారం సమావేశం కాకుంటే ఆదివారం భేటీ కానున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటితే 2019కి మోడీ మరింత స్ట్రాంగ్ లీడర్ అవుతారు. మరోవైపు, యూపీలో బీజేపీ విజయాన్ని అడ్డుకుంటామని సమాజ్ వాది పార్టీ - కాంగ్రెస్ పార్టీ కూటమి చెబుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+