వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఖిలేష్ యాదవ్ భయపడ్డాడు, అందుకే సేఫ్ సీటు కర్హాల్ కు పారిపోయాడు: బీఎస్పీ మాయావతి

|
Google Oneindia TeluguNews

బీఎస్పీ అధినేత్రి మాయావతి సోమవారం తన పార్లమెంటరీ నియోజకవర్గం అజంగఢ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. 2019లో తన పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసినందుకే ఆయన లోక్‌సభ స్థానంలో గెలిచారని చెప్పారు. ఈ దఫా ఎన్నికలలో బిఎస్‌పితో పొత్తు లేని కారణంగా అఖిలేష్ యాదవ్ తన తండ్రి పార్లమెంటరీ నియోజకవర్గమైన మెయిన్‌పురిలోని కర్హాల్‌కు పారిపోయారని విమర్శించారు.

మాతో పొత్తు లేక కర్హాల్ కు అఖిలేష్ యాదవ్ పారిపోయాడు

మాతో పొత్తు లేక కర్హాల్ కు అఖిలేష్ యాదవ్ పారిపోయాడు


సమాజ్వాది పార్టీ మరియు బహుజన సమాజ్ పార్టీ మధ్య పొత్తు లేని కారణంగా, తన కొత్త కూటమి భాగస్వాములు ఎటువంటి సహాయం చేయరని అఖిలేష్‌కు అర్థమై ఇక్కడ నుండి పారిపోవాల్సి వచ్చిందని మాయావతి ఎద్దేవా చేశారు . తన తండ్రి పార్లమెంటరీ నియోజకవర్గమైన మెయిన్‌పురి లోని కర్హాల్ సురక్షితమైన సీటును ఎంచుకున్నాడని మాయావతి పేర్కొన్నారు. అఖిలేష్ యాదవ్ తనకు సహాయం కోసం తనవృద్ధుడైన అనారోగ్యంతో ఉన్న తండ్రిని కూడా ఎన్నికల ప్రచారంలో తిప్పుతున్నారు అని విమర్శించారు.

పార్టీ అధినేత పారిపోతే పార్టీ ఎంత బలంగా ఉందో అర్ధం అవుతుంది

పార్టీ అధినేత పారిపోతే పార్టీ ఎంత బలంగా ఉందో అర్ధం అవుతుంది


తమ అధినేత అఖిలేష్ యాదవ్ అజంగఢ్‌ నుంచి పారిపోయినప్పుడు ఎస్పి అభ్యర్థులు ఎంత బలంగా ఉన్నారో మీరు అంచనా వేయవచ్చు అని యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి పేర్కొన్నారు. ఎస్పీకి ఓటు వేయడం వల్ల బీజేపీకి లాభం చేకూరుతుందని అన్నారు. ఎస్పీ యూపీలో అధికారం చేజిక్కించుకునే అవకాశం లేదన్నారు. ఎస్పీ తిరిగి అధికారంలోకి రాకుండా ఆపేందుకు బీఎస్పీ ప్రయత్నిస్తోందని తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు బట్టే అర్థమవుతుంది.

ఎస్పీ బీజేపీకి బి టీమ్ గా పనిచేస్తుందని మాయావతి ఆరోపణ

ఎస్పీ బీజేపీకి బి టీమ్ గా పనిచేస్తుందని మాయావతి ఆరోపణ


బీఎస్పీ బీజేపీకి బీ టీమ్ అని ఆరోపిస్తున్నందుకు ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేసిన మాయావతి, ఎస్పీ, కాంగ్రెస్ రెండూ తమ మద్దతుదారులను తప్పుదోవ పట్టించడం ద్వారా బీఎస్పీపై కుట్ర పన్నుతున్నాయని అన్నారు. ఎస్పీ బీజేపీకి బి టీమ్ గా పనిచేస్తుందని మాయావతి ఆరోపించారు. బీఎస్పీ బలంగా ఉన్న చోట బిజెపికి ఓటు వేయమని ఎస్పి ప్రజలకు చెబుతోందని మాయావతి పేర్కొన్నారు. ఎస్పి నాయకులకు ఎట్టిపరిస్థితుల్లోనూ బీఎస్పీ గెలవడం ఇష్టంలేదని ఆమె ఆరోపణలు గుప్పించారు. అయినా బీఎస్పీ బలమైన పార్టీ అని, ప్రజల మద్దతు తమ పార్టీకి ఉందని పేర్కొన్నారు.

కాంగ్రెస్ విమర్శలపైనా మాయావతి ఫైర్ ,బీజేపీ పైనా ధ్వజం

కాంగ్రెస్ విమర్శలపైనా మాయావతి ఫైర్ ,బీజేపీ పైనా ధ్వజం


అలాగే, కాంగ్రెస్‌ పైన కూడా విమర్శలు గుప్పించిన మాయావతి, దళితులు కష్టాల్లో ఉన్నప్పుడు బీఎస్పీ అధినేత్రి ఎప్పుడూ వారిని సందర్శించలేదని చెప్పి దళితులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తోందని ఆమె అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా దళితుల ఇళ్లను వ్యక్తిగతంగా సందర్శించడం లేదని, ఆ పార్టీ యూపీ ఇన్‌చార్జి వారిని సందర్శిస్తున్నారని ఆమె అన్నారు.

సోనియా గాంధీలాగే తాను కూడా పార్టీ అధ్యక్షురాలిని, అవసరమైన వారిని కలుసుకోవడానికి మరియు తక్షణ సహాయం అందించడానికి స్థానిక నాయకులను నియమిస్తానని మాయావతి తెలిపారు. అంతమాత్రాన దళితుల పట్ల అభిమానం లేదని కాదని పేర్కొన్నారు. బీజేపీ కేవలం మతం పేరుతో ఉద్రిక్తతలను సృష్టించిందని ఆమె పేర్కొన్నారు. బీజేపీ హయాంలో దళితులు, ఓబీసీలకు రిజర్వేషన్లు రావడం లేదన్నారు. బీఎస్పీని ఆదరించాలని మాయావతి విజ్ఞప్తి చేశారు.

English summary
BSP chief Mayawati on Monday lashed out at Samajwadi Party chief Akhilesh Yadav in her parliamentary constituency of Azamgarh. Mayawati alleged that Akhilesh Yadav had fled to Karhal seat due to his lack of alliance with the BSP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X