UP Elections 2022: ముజఫర్‌నగర్‌లోని పోలింగ్ బూత్ లో ఈవీఎం మొరాయింపు, సమాజ్‌వాదీ ఆరోపణల మధ్య పోలింగ్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. చిన్న చిన్న అవాంతరాల మధ్య పోలింగ్ సాగుతుంది. మొదటి దశ ఓటింగ్ నేపధ్యంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (ఈవీఎం)లో కొంత లోపం కారణంగా ముజఫర్‌నగర్‌లోని ఓ బూత్‌లో పోలింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ సంఘటన ఇస్లామియా ఇంటర్‌కాలేజ్ నుండి నివేదించబడింది.
ఓటు వేయడానికి వేచి ఉన్న ఓటర్లు ఈవీఎంలో లోపం కారణంగా 90 నిమిషాలకు పైగా వేచి ఉండాల్సి వచ్చిందని పేర్కొన్నారు. చివరికి ముజఫర్‌నగర్‌లోని బూత్‌లో ఓటింగ్ మళ్లీ ప్రారంభమైంది, అయితే ప్రస్తుతానికి ఓటర్ల లైన్లు నెమ్మదిగా కదులుతున్నట్లు సమాచారం. ఓటింగ్‌లో జాప్యం జరుగుతోందని, ఈవీఎం మిషన్‌లో కొంత సమస్య ఉందని, తర్వాత రావాలని పోలింగ్ బూత్‌లోని అధికారులు చెప్పారని ఓటర్లు తెలిపారు. చాలా మంది ఓటు వెయ్యటానికి పోలింగ్ బూత్ వద్దే వేచి ఉన్నారు.

యూపీ తొలి దశ పోలింగ్‌లో ఉదయం 9 గంటల వరకు 7.93 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికల సంఘం జారీ చేసిన కోవిడ్-సముచిత మార్గదర్శకాలకు అనుగుణంగా పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. తొలి దశలో యూపీలోని 11 జిల్లాల్లోని 58 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. తొలి దశలో 623 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, ఈ దశలో 2.27 కోట్ల మంది ప్రజలు ఓటు వెయ్యవలసి ఉంది. మొదటి దశలో జాట్‌ల ఆధిపత్యం ఉన్న పశ్చిమ యుపి ప్రాంతం మరియు దోబ్‌లో ఓటింగ్ జరుగుతుంది.
యూపీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రారంభం కాగానే ఓటు వేసి దేశానికి భయం నుండి విముక్తి ఇవ్వండి అని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఇదే సమయంలో యూపీలోని షామ్లీలోని కైరానాలో అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ జరుగుతున్నందున పేద వర్గానికి చెందిన ఓటర్లను బెదిరించి పోలింగ్ బూత్‌ల నుంచి పంపిస్తున్నారని సమాజ్‌వాదీ పార్టీ ఆరోపించింది. ఇదిలా ఉంటే మెయిన్‌పురిలోని కర్హాల్ నుంచి సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌పై పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి, బీజేపీ నేత ఎస్పీ సింగ్ బఘేల్ ఆగ్రాలో ఓటు వేశారు.












Click it and Unblock the Notifications