యూపీలో హంగ్ అసెంబ్లీ ఏర్పడితే బీజేపీ అధికారంలోకి రాకుండా ఆప్ వ్యూహం చెప్పిన కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గురువారం ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పర్యటిస్తున్నారు. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్రల ద్వారా, బహిరంగ సభల ద్వారా పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారం నుండి దూరం చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
మరోవైపు, వారణాసిలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలు ఇంటింటి ప్రచారాన్ని ఫిబ్రవరి 16న ప్రారంభించారని యూపీ ఆప్ అధికార ప్రతినిధి ముఖేష్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం, వారణాసిలోని అన్ని నియోజకవర్గాలు భారతీయ జనతా పార్టీ (బిజెపి) పాలనలో ఉన్నాయి. మార్చి 7న జిల్లాలో ఏడవ, చివరి దశ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎన్నికల ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు.
పంజాబ్ లో ఇప్పటికే ఎన్నికలు పూర్తి కావడంతో, అరవింద్ కేజ్రీవాల్ తన దృష్టిని ఉత్తరప్రదేశ్ వైపు మళ్లించారు. సోమవారం నుండి తన నాలుగు రోజుల పర్యటనను ప్రారంభించారు.ఆప్ యొక్క వివిధ ఎన్నికల సంబంధిత కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఆయన లక్నో, బారాబంకి మరియు రుధౌలీలను సందర్శించారు.ఎన్నికల ప్రచారంలో తీవ్రస్థాయిలో ప్రత్యర్ది పార్టీలపై విరుచుకుపడ్డారు. తనను టెర్రరిస్టు అన్న ప్రత్యర్ది పార్టీలకు అవును తాను అవినీతిపరులను భయపెట్టే టెర్రరిస్టును అని చెప్పుకొచ్చారు.

యూపీలో హంగ్ అసెంబ్లీ ఏర్పడితే, బీజేపీని అధికారానికి దూరంగా ఉంచేందుకు ఆప్ ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకుంటుందని ఢిల్లీ ముఖ్యమంత్రి చెప్పారు. యుపిలో హంగ్ అసెంబ్లీ ఏర్పడితే, తాము బీజేపీ అధికారంలోకి రాకుండా ఉండటం కోసం పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కాబట్టి సీట్ల గురించి ఆలోచించొద్దు అని, ఎంతో ఉత్సాహంతో ఆప్‌కి ఓటు వేయండని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
ఈసారి ఉత్తరప్రదేశ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే 300 యూనిట్ల ఉచిత విద్యుత్, మెరుగైన ఆరోగ్య వ్యవస్థ, ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థ, నిరుద్యోగ భృతి వంటి వాగ్దానాలను నెరవేరుస్తామని ఆప్ ప్రకటించింది.అసెంబ్లీ ఎన్నికలలో మొదటి నాలుగు దశలు ముగియగా, నాలుగో దశ పోలింగ్‌లో 61% కంటే ఎక్కువ ఓటింగ్ నమోదైంది. ఫిబ్రవరి 27న ఐదో, మార్చి 3న ఆరో దశ పోలింగ్ జరగనుంది. ఏడో దశ మార్చి 7న జరగనుంది. అన్ని దశల ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన మార్చి 10న ఉంటుంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications