నరసింహ స్వామిగా సీఎం నితీష్ కుమార్, వివాదం
పాట్నా/లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పోస్టర్ల వివాదం కొనసాగుతోంది. ఇటీవల ఉత్తర ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కేశవ్ మౌర్యను కృష్ణుడిగా, ప్రతిపక్షాలను కౌరవులుగా చిత్రిస్తూ ముద్రించిన పోస్టర్‌పై రాజకీయంగా దుమారం రేపింది.
తాజాగా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను నరసింహ స్వామిగా చిత్రీకరిస్తూ వెలసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాకుండా విమర్శలకు కూడా తావిస్తోంది. ఆది శేషుడిపై కూర్చుని లిక్కర్‌ను చిదిమేస్తూ అవినీతిని, అసమర్థపాలనను పాదాలతో తొక్కుతూ ఉన్నట్లు దీనిని రూపొందించారు.

దీనిపై జేడీయూ అధికార ప్రతినిధి అమిత్ వెంటనే స్పందించారు. ఆ పోస్టర్‌కు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తాము ఇలాంటి ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించమని, ఇది వారి వ్యక్తిగత అభిప్రాయం పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు.












Click it and Unblock the Notifications