వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపీలో అమల్లోకి వచ్చిన లవ్ జిహాద్‌ వ్యతిరేక చట్టం- దేశంలోనే తొలి రాష్ట్రంగా

|
Google Oneindia TeluguNews

లవ్‌ జిహాద్‌కు సంబంధించి సుప్రీంకోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసినా, విపక్షాలు వ్యతిరేకిస్తున్నా అవేవీ లెక్కచేయకుండా యూపీలోని యోగీ ఆదిత్యనాథ్‌ సర్కారు తాజాగా ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. రాష్ట్రంలో మత మార్పిళ్లకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన ప్రత్యేక ఆర్డినెన్స్‌పై గవర్నర్‌ ఆనందీబెన్ పటేల్‌ సంతకం చేశారు. దీంతో దేశంలోనే తొలిసారిగా లవ్‌ జిహాద్‌ వ్యతిరేక చట్టం అమల్లోకి వచ్చింది.

ముస్లిం యువకులు హిందూ యువతులను ట్రాప్‌ చేసి వివాహం చేసుకోవడాన్ని "లవ్‌ జిహాద్‌"గా పేర్కొంటున్న బీజేపీ, దాని అనుబంధ సంస్ధలు దీనిపై పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతున్నాయి. యూపీలోని యోగీ ఆదిత్యనాథ్‌ సర్కారు మరో అడుగు ముందుకేసి లవ్‌ జిహాద్‌కు వ్యతిరేకంగా ఓ చట్టాన్నే చేసేసింది. ముస్లిం యువకులు ఉద్దేశపూర్వకంగా హిందూ యువతులను మతం మారుస్తున్నాని ఆక్షేపిస్తూ తాజాగా ఓ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. దీనికి గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్ ఆమోదముద్ర వేశారు.

UP first state to bring anti-love jihad law after Governor promulgates ordinance

Recommended Video

J&K DDC Elections Phase 1 Polling Underway జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత తొలిసారి!

తాజాగా అమల్లోకి వచ్చిన ఆర్డినెన్స్‌ ప్రకారం మైనర్లు, ఎస్సీ, ఎస్టీ యువతులను బలవంతంగా మతమార్పిడి చేయడం నిషేధం. అలా బలవంతంగా మత మార్పిడికి పాల్పడితే మూడేళ్ల నుంచి పదేళ్ల జైలు శిక్ష విధిస్తారు. దీంతో పాటు 25 వేల రూపాయల జరిమానా కూడా ఉంటుంది. ఎక్కువమందిని ఒకేసారి మతమార్పిడి చేస్తే మూడేళ్ల నుంచి పదేళ్ల జైలుశిక్షతో పాటు 50 వేల జరిమానా విధిస్తారు.
ఇలా జరిగిన వివాహాలను అనధికారికంగా గుర్తిస్తారు. పెళ్లి తర్వాత మతం మార్చుకోవాలనుకుంటే మాత్రం జిల్లా మెజిస్ట్రేట్‌కు దరఖాస్తు చేసుకోవాలి.

English summary
Governor Anandiben Patel on Saturday promulgated the UP Prohibition of Unlawful Conversion of Religion Ordinance 2020, making it a law. The anti-love jihad law becomes applicable from today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X