యుపి కజిన్స్‌‌పై గ్యాంగ్ రేప్, హత్య: నలుగురి అరెస్టు

 UP gang-rape and murder: Four arrested; NCW steps in
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు అమ్మాయిలపై సామూహిక అత్యాచారం చేసి, వారిని చెట్టుకు ఉరేసి చంపిన కేసులో పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో పోలీసు కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. ఇదిలావుంటే, జాతీయ మహిళా కమిషన్ ఈ సంఘటనను సూమోటాగా స్వీకరించి, విచారణ చేపట్టింది. ఓ బృందాన్ని బాదౌన్ జిల్లాకు పంపిస్తోంది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, వారిని చెట్టుకు ఉరేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాదౌన్ జిల్లా కాత్రా గ్రామంలో జరిగినట్లు పోలీసులు బుధవారంనాడు చెప్పారు. ఈ ఇద్దరు కజిన్స్ కూడా గత రాత్రి నుంచి కనిపించకుండా పోయారు. ఉదయంపూట వారిద్దరి శవాలు గ్రామంలోని మామిడి చెట్టుకు వేలాడుతూ కనిపించాయి.

ఈ బాలికల వయస్సు 14, 15 ఏళ్ల మధ్య ఉంటుంది. సంఘటనకు విస్తుపోయిన గ్రామస్తులు సంఘటనా స్థలంలో గుమిగూడారు. ఓ పోలీసు కానిస్టేబుల్, మరో నలుగురు ఈ సంఘటనకు బాధ్యులని గ్రామస్తులు ఆరోపించారు. నిందితులతో పాటు ఓ పోలీసు కానిస్టేబుల్ కూడా పారిపోయినట్లు పోలీసు సూపరింటిండెంట్ మాన్ సింగ్ చౌహాన్ బుధవారంనాడు చెప్పారు. ఆ కానిస్టేబుల్‌ను సర్వేష్ యాదవ్‌గా గుర్తించారు.

సామూహిక అత్యాచారం జరిగిందనే విషయాన్ని కొట్టి పారేయలేమని, అయితే దాన్ని వైద్య పరీక్షల్లో నిర్ధారించుకోవాల్సి ఉందని చౌహాన్ చెప్పారు. గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. ఉషైత్ పోలీసు స్టేషన్‌లోని పోలీసులను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకోవడానికి వెనకాడారని వారు ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+