మోడీ సవాల్: సహకరిస్తామని అఖిలేష్ యాదవ్
లక్నో: నదులను పరిశుభ్రం చేయడానికి తమ ప్రభుత్వం కేంద్రానికి సహకరిస్తుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చెప్పారు. ఆయన బుధవారంనాడు 35వ జూనియర్ జాతీయ రోయింగ్ చాంపియన్‌షిప్ పోటీలను గోమతి నది వద్ద ప్రారంభించారు. నదులను శుభ్రం చేయడం మన సంస్కృతికి, అస్తిత్వానికి ప్రధానమని ఆయన అన్నారు.
నదులు మన సంస్కృతి, ఉనికిలో భాగమని, నదులను రక్షించడానికి తాము పనిచేస్తామని, నదులను పరిశుభ్రం చేయడానికి తమ ప్రభుత్వం సహకరిస్తుందని ఆయన చెప్పారు. జలప్రవాహాల మీదుగానే ప్రాచీన కాలంలో వ్యాపారాలు జరిగేవని, లక్నో గుండా నది ప్రవహించడం ఆ నగరం అదృష్టమని, ముఖ్యమైన భవనాలు దాని ఒడ్డున ఉన్నాయని ఆయన అన్నారు. నదులను పరిశుభ్రం చేయడానికి బడ్జెట్ అవసరమని అభిప్రాయపడ్డారు.

స్వచ్ఛ భారత్‌లో భాగంగా నరేంద్ర మోడీ ఇటీవల అఖిలేష్ యాదవ్‌తో పాటు తొమ్మిది మందిని ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిది మందిని నామినేట్ చేశారు. రాష్ట్రంలో పరిశుభ్రతను పాటించడానికి వారిని ఆయన నామినేట్ చేశారు. పరిశుభ్రత పేర పోటీ ప్రారంభమైందని అఖిలేష్ యాదవ్ అన్నారు. అయితే, ఏ దిశగా సాగాలనే విషయంపై మనం ఆలోచన చేయాలని ఆయన అన్నారు.
అథ్లెట్స్‌కు రివార్డులు అందించడం ద్వారా క్రీడాకారులను తమ ప్రభుత్వం గౌరవిస్తోందని, రెజ్లర్లకు మాత్రమే తాము ప్రాధాన్యం ఇస్తున్నామని మాటలో నిజం లేదని అన్నారు. యశ్ భారతి అవార్డులను చూస్తే వాటిని పొందినవారిలో అన్ని రంగాలకు చెందిన క్రీడాకారులు ఉంటారని చెప్పారు. సోషలిస్టులు క్రీడాకారులను ఎక్కువగా గౌరవిస్తారని చెప్పారు.












Click it and Unblock the Notifications