స్వామి చిన్మయానందపై రేప్ కేసు ఉపసంహరణ

Subscribe to Oneindia Telugu

షాజహాన్‌పూర్‌: 2011లో ఓ బాలికను అపహరించుకుపోవడంతో పాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి స్వామీ చిన్మయానందకు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఊరట కల్పించింది. అతనిపై ఉన్న కేసును ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది.

ప్రభుత్వం నుంచి ఈ మేరకు అందిన లేఖను షాజహాన్‌పూర్‌ జిల్లా యంత్రాంగం సంబంధిత విచారణాధికారికి పంపించింది. మరోపక్క యూపీ సర్కారు నిర్ణయాన్ని అత్యాచార బాధితురాలు తప్పుపట్టారు.

 UP govt withdraws rape case against former Union Minister Swami Chinmayanand

రాష్ట్రపతి, భారత ప్రధాన న్యాయమూర్తి తదితరులకు ఆమె లేఖలు రాస్తూ... చిన్మయానందపై వారెంటు జారీ అయ్యేలా చూడాలని కోరారు. స్వామి చిన్మయానంద్‌ మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. వాజపేయి ప్రభుత్వంలో హోంశాఖ సహాయమంత్రిగా పనిచేశారు.

2011లో హరిద్వార్‌లోని తన ఆశ్రమానికి ఎత్తుకెళ్లి, తన కూతురిపై చిన్మయానంద అత్యాచారానికి పాల్పడ్డారంటూ బాధిత బాలిక తండ్రి షాజహాన్‌పూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలను చిన్మయానంద ఖండించారు. హెకోర్టుకు వెళ్లి అరెస్టుకాకుండా స్టే తెచ్చుకున్నారు. అప్పటి నుంచి ఈ కేసు పెండింగ్‌లోనే ఉంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
After issuing orders to withdraw criminal cases pending in courts against BJP leaders in Muzaffarnagar riots, the Yogi Adityanath government has passed another order to withdraw rape case against former Union minister of state for Home Swami Chinmayanand.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి