వేరొకరితో పెళ్లి: ప్రియురాలిని చంపి, ఆత్మహత్య
లక్నో: ఉత్తరప్రదేశ్ లోని జాన్ పూర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మరో వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైన ప్రియురాలిని కాల్చి చంపిన ప్రేమికుడు, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జైహింద్ మౌర్య(35), పింకీ యాదవ్ (18) గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. అయితే, పింకీ యాదవ్‌కు ఇటీవల వేరే వ్యక్తితో వివాహం నిశ్చయమైంది.

వచ్చే మార్చిలో పెళ్లి జరగాల్సివుంది. ఈ విషయం తెలుసుకున్న మౌర్య.. పింకీ మనసు మార్చేందుకు ప్రయత్నించాడు. వేరే వ్యక్తితో వివాహం రద్దు చేసుకుని, తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరాడు.
అయితే కుటుంబసభ్యులు ఒత్తిడి చేస్తున్నారంటూ ప్రియుడి ప్రతిపాదనను తిరస్కరించింది పింకీ. దీంతో ఆగ్రహానికి గురైన మౌర్య తుపాకీతో పింకీని కాల్చిచంపాడు. అనంతరం మౌర్య కూడా తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివాహ కార్యక్రమంతో సంతోషంగా ఉండాల్సిన పింకీ ఇంట విషాదం నెలకొంది.












Click it and Unblock the Notifications