మందుమాంసాలకు ఓటేస్తారు: యుపి మంత్రి వివాదస్పద వ్యాఖ్యలు

Posted By:
Subscribe to Oneindia Telugu

లక్నో: ఉత్తరప్రదేశ్ మంత్రి ఒకరు పేదలపై వివాదాస్పద వ్యాఖ్యలుచ ేసారు. పేద ప్రజలు ఓటు వేయడంపై ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ ప్రభుత్వంలోని మంత్రి ఓం ప్రకాష రాజ్‌భర్ ఆ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

మందు, కోడి మాంసాలు ఇస్తే పేద ప్రజల ఓటు దక్కినట్టేనని ఓం ప్రకాశ్‌ అన్నారు. రాజకీయ పార్టీలకు ఓటు వేయడానికి పేద ప్రజలు ఆల్కహాల్‌ తీసుకుంటారని, చికెన్‌ తింటారని ఆయన అన్నారు.

UP Minister makes controversial comments

ఎన్నికల్లో గెలిచిన తర్వాత పార్టీలు పేద ప్రజలకు ట్రీట్ ఏమీ ఇవ్వవని కానీ చికెన్‌ ఇస్తాయని ఆయన అన్నారు. ఢిల్లీ, లక్నోల్లో ఆ మాదిరిగానే ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయని ఆయన అన్నారు. బాల్‌రామ్‌పూర్‌ సభలో ఆయన ఆ వ్యాఖ్యలు చేసారు.

ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. మద్యాన్ని దుర్వినియోగ పరుస్తున్నారని తన రాజ్‌భర్‌ కమ్యూనిటీ సభ్యులపై ఇదివరకు మంత్రి ఆరోపణలు చేశారు. నెల క్రితం చేసిన ఈ ఆరోపణలపై వివాదం చెలరేగింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
UP miniser Om Prakash Rajbhar said that the poor votes for leaders, based on "small incentives" like food and alcohol promised to them.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి