కరోనా కబళింపు: యూపీ మంత్రి మృతి.. ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేల మృత్యువాత
కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు. వైరస్ కాటుకు ప్రజా ప్రతినిధులు కూడా రాలిపోతున్నారు. ఉత్తరప్రదేశ్ మంత్రి విజయ్ కుమార్ కశ్యప్ చనిపోయారు. గురుగ్రామ్‌లోని వేదాంత ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న ఫలితం లేకపోయింది. కరోనా సెకండ్ వేవ్‌లో యూపీలో ఇప్పటికే నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు చనిపోగా.. ఈయనతో అదీ ఐదుకి చేరింది.

యూపీ మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే బహదూర్ కొరి ఈ నెల 7వ తేదీన చనిపోయారు. వారం రోజులు లక్నో ఆస్పత్రిలో చికిత్స తీసుకుని మృతిచెందారు. రాజ్ నాథ్ సింగ్ హయాంలో కొరి మంత్రిగా పనిచేశారు. నవాబ్ జంగ్ నియోజకవర్గ ఎమ్మెల్యే కేసర్ సింగ్ గంగ్వార్ చనిపోయారు. తొలుత బోజిపుర మెడిక్ కాలేజీలో చికిత్స తీసుకున్నారు. కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ కూడా అయ్యారు. మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు. ఆస్పత్రికి తీసుకెళ్లగా.. పాజిటివ్ వచ్చింది. ప్లాస్మా థెరపీ చేసిన ఫలితం లేకుండా పోయింది.
లక్నో పశ్చిమ ఎమ్మెల్యే సురేశ్ కుమార్ శ్రీ వాస్తవ కూడా కరోనా సోకి చనిపోయారు. ఆయన భార్య మాలతిది కూడా అదే పరిస్థితి ఏర్పడింది. అరారియా సదర్ ఎమ్మెల్యే రమేశ్ చంద్ర దివాకర్ కూడా కోవిడ్ సోకి మృత్యువాత పడ్డారు. అతని ఊపిరితిత్తుల్లో చాలా ఇబ్బందిగా మారాయి. మీరట్ మెడికల్ కాలేజీలో చేరిన ఫలితం లేకుండా పోయింది. బీఎస్పీ, ఎస్పీకి చెందిన నేతలు కూడా ఇదేవిధంగా చనిపోయారు.












Click it and Unblock the Notifications