వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

UP Polls: 91 మందితో బీజేపీ జాబితా విడుదల, అయోధ్య నుంచి పోటీలో ఎవరంటే.?

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న క్రమంలో అధికార బీజేపీ పార్టీ మరో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. శుక్రవారం 91 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసింది. ప్రస్తుతం కీలకంగా మారిన అయోధ్య స్థానానికి కూడా బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వేద్ ప్రకాశ్ గుప్తానే ఆ స్థానం నుంచి మరోసారి బరిలోకి దింపింది.

Recommended Video

UP Assembly Elections 2022 : BJP Releases 6th Candidates List | Oneindia Telugu

తాజాగా, ప్రకటించిన 91 మంది అభ్యర్థుల్లో 13 మంది మంత్రులు కూడా ఉన్నారు. సహకార వ్యవహారాల మంత్రి ముకుత్ బిహారీ వర్మకు టికెట్ ఇవ్వలేదు. ఆయన కుమారుడు గౌర్.. కైజర్‌గంజ్ నుంచి పోటీ చేస్తుండటంతో పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మీడియా సలహాదారు శలభ్ మణి త్రిపాఠి ఎన్నికల బరిలో నిలిచారు.

 UP Polls: BJP Releases List Of 91 Names including 13 ministers, Know Candidate Contesting From Ayodhy

కాగా, మొదట సీఎం యోగి ఆదిత్యనాథ్ అయోధ్య నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. దీంతో సీఎం పోటీ చేస్తానంటే తాను తప్పుకోవడానికి సిద్ధమని వేద్ ప్రకాశ్ గుప్తా తెలిపారు. అయితే, సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ సదర్ నుంచి పోటీ చేస్తుండటంతో.. అయోధ్య స్థానాన్ని మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యే వేద్ ప్రకాశ్ గుప్తాకే కేటాయించారు. మరోవైపు, సమాజ్ వాదీ పార్టీ తరపున అయోధ్య నుంచి పవన్ పాండే బరిలో ఉన్నారు. మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కేబినెట్ లో మంత్రి పనిచేసిన పాండే.. 2017లో వేద్ ప్రకాశ్ చేతిలో ఓడిపోయారు.

మంత్రివర్గంలో అలహాబాద్ వెస్ట్ నుంచి పోటీ చేస్తున్న సిద్ధార్థ్ నాథ్ సింగ్, అలహాబాద్ సౌత్ నుంచి పోటీలో నంద్ గోపాల్ గుప్తా 'నంది' ఉన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి సూర్య ప్రతాప్ షాహీ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి-మార్చిలో ఏడు దశల్లో జరగనున్నాయి.

1వ దశ: ఫిబ్రవరి 10
2వ దశ: ఫిబ్రవరి 14
3వ దశ: ఫిబ్రవరి 20
4వ దశ: ఫిబ్రవరి 23
5వ దశ: ఫిబ్రవరి 27
6వ దశ: మార్చి 3
7వ దశ: మార్చి 7
మార్చి 10న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

English summary
UP Polls: BJP Releases List Of 91 Names including 13 ministers, Know Candidate Contesting From Ayodhy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X