వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

UP polls: ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ నామినేషన్ దాఖలు, కంచుకోట కర్హల్ నుంచే పోటీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మరికొద్ది వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ కుమార్ యాదవ్ సోమవారం తన నామినేషన్ దాఖలు చేశారు. మెయిన్‌పురిలోని కర్హల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అఖిలేష్ తోపాటు పలువురు ఎస్పీ అభ్యర్థులు కూడా తమ నామినేషన్లు దాఖలు చేశారు.

కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తుండటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ప్రస్తుతం ఆయన ఆజంగఢ్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. 1993 నుంచి కర్హల్ నుంచి సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థులే గెలుపొందుతుండటం గమనార్హం. 2002లో మాత్రం ఎస్పీ అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. ప్రస్తుతం కర్హల్ నుంచి ఎస్పీ నేత సోబరన్ సింగ్ యాదవ్ ఎమ్మెల్యేగా ఉన్నారు.

UP polls: SP Chief Akhilesh Yadav Files Nomination From Homeground Karhal Seat

సొంతపట్టణం నుంచి సైఫై నుంచి కలెక్టరేట్ ఆఫీసుకు వచ్చి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అఖిలేష్ యాదవ్ తోపాటు మరో ముగ్గురు ఎస్పీ అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారని ఆ పార్టీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి తెలిపారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో తాను కూడా బరిలో దిగాలని అఖిలేష్ యాదవ్ నిర్ణయించుకున్నారు.
సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ అర్బన్ సీటు నుంచి పోటీ చేస్తున్నారు. ఇంతకుముందు యోగి ఆదిత్యనాథ్, అఖిలేష్ యాదవ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికై నుంచే యూపీ ముఖ్యమంత్రులుగా పనిచేశారు.

ఫిబ్రవరి 20న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మూడో దశలో మెయిన్‌పురి స్థానానికి ఓటింగ్ జరగనుంది. సమాజ్‌వాదీ పార్టీ పితామహుడు మరియు అఖిలేష్ యాదవ్ తండ్రి, ములాయం సింగ్ మెయిన్‌పురి స్థానం నుంచి లోక్‌సభలో సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు.

Recommended Video

UP Assembly Elections 2022 : RPN Singh Joins In BJP | Oneindia Telugu

రాబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసం, ఎస్పీ.. జయంత్ చౌదరి నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ దళ్‌తో పొత్తు పెట్టుకుంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి ఏడు దశల్లో ప్రారంభం కానున్నాయి. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

English summary
UP polls: SP Chief Akhilesh Yadav Files Nomination From Homeground Karhal Seat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X