వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపీలో ‘యోగి హెయిర్‌కట్’ వివాదాస్పదం: తల్లిదండ్రుల ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రోజుకో విషయం సంచలనంగా మారుతోంది. తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెయిర్ స్టైల్ తెరపైకి వచ్చింది. ఓ ప్రైవేట్‌ పాఠశాల యాజమాన్యం అత్యుత్సాహం ప్రదర్శించి.. సీఎం యోగి ఆదిత్యానాథ్‌ హెయిర్‌ స్టైల్‌ను ఫాలో కావాలని విద్యార్థులను ఆదేశించింది. లేకపోతే స్కూల్లోకి అనుమతించబోమని హెచ్చరించింది.

తల్లిదండ్రుల ఆగ్రహం

తల్లిదండ్రుల ఆగ్రహం

ఈ క్రమంలో పాఠశాల యాజమాన్యం విపరీత ప్రవర్తనపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. లక్నోలోని రిషభ్‌ అకాడమీ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ హెయిర్‌స్టైల్‌ మాదిరిగా విద్యార్థులు హెయిర్‌ కట్‌ చేయించుకోవాలని.. లేకపోతే తరగతి గదుల్లోకి అనుమతించబోమని తెలిపింది.

ఆందోళన

ఆందోళన

విద్యార్థుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న వారి తల్లిదండ్రులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. యాజమాన్యం తీరుపై మండిపడుతూ స్కూల్‌ ఎదుట ఆందోళనకు దిగారు. విద్యార్థులు మాంసాహార పదార్థాలను తెచ్చుకోవడంపై కూడా యాజమాన్యం నిషేధం విధించిందని ఆరోపించారు.

అలా చెప్పలేదే..

అలా చెప్పలేదే..

తల్లిదండ్రుల ఆందోళనతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. అయితే ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం స్పందిస్తూ.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పింది. అంతేగాక, మంచి వస్త్రధారణ, హెయిర్‌ కట్‌తో రావాలని మాత్రమే తాము సూచించామని పాఠశాల యాజమాన్యం స్పష్టం చేసింది.

యూపీ సంచలనం

యూపీ సంచలనం

ఆదిత్యనాథ్ ఇప్పటికే పలు సంస్కరణలను అమలు చేస్తూ దేశంలో సంచలనాల సీఎంగా మారిన విషయం తెలిసిందే. అధికారంలోకి రావడంతోనే అక్రమ కబేళాలపై నిషేధం, ప్రభుత్వ కార్యాలయాలు శుభ్రంగా ఉంచడం కోసం గుట్కాలపై నిషేధం అమలు చేయడం, 15రోజుల జాతీయ నేతల సెలవులను రద్దు చేయడం, మహిళా రక్షక దళాలను ఏర్పాటు చేయడం లాంటి చర్యలకు ఉపక్రమించారు.

English summary
A private school in Meerut city of Uttar Pradesh on Thursday allegedly issued a diktat to its students to sport 'Yogi-style' hair cut, raising the hackles of shocked parents who protested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X