వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెన్సిల్, ఎరాజర్ దొంగిలించాడని చితక్కొట్టిన ప్రిన్సిపాల్: విద్యార్థి మృతి

|
Google Oneindia TeluguNews

బారాబంకి: పెన్సిల్, ఎరాజర్(రబ్బర్) దొంగిలించడానే కారణంగా ఓ పాఠశాల ప్రిన్సిపాల మూడవ తరగతి చదువుతున్న విద్యార్థిని తీవ్రంగా కొట్టాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆ చిన్నారి మృతి చెందాడు. ఈ దిగ్భ్రాంతికర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బారాబంకి జిల్లాలోని ఓ పాఠశాలలో చోటు చేసుకుంది.

స్థానిక మీడియా కథనం ప్రకారం.. రేలమా ప్రాంతంలోని ద్వారకా ప్రసాద్ పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్న ఎనిమిదేళ్ల బాలుడ్ని ఆ పాఠశాల ప్రిన్సిపాల్ పెన్సిల్, ఎరాజర్ దొంగిలించాడనే నెపంతో తీవ్రంగా కొట్టాడు. దయలేని ఆ ప్రిన్సిపాల్ దెబ్బలకు తాళలేక తీవ్రంగా రోదించాడు.

పాఠశాల ముగిసిన తర్వాత బాలుడు ఇంటికెళ్లిపోయాడు. కడుపు నొప్పిగా ఉందని చెప్పిన ఆ బాలుడి నోటి నుంచి రక్తం పడింది. దీంతో బాలుడి కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

UP shocker: Class 3 student beaten to death over stolen pencil, eraser

కాగా, బాలుడు అప్పటికే మృతి చెందాడని ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ప్రిన్సిపాల్ లలిత్ కుమార్ వర్మను అరెస్ట్ చేసి, కోర్టులో ప్రవేశపెట్టారు.

కొందరు విద్యార్థులు తమ పెన్సిళ్లు, రబ్బర్లు పోతున్నాయని క్లాస్ టీచర్‌కు చెప్పడంతో అతను విద్యార్థులందర్నీ తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో మృతుడితోపాటు మరో బాలుడి వద్ద కొన్ని రబ్బర్లు, పెన్సిళ్లు లభించాయి. దీంతో ఆగ్రహానికి గురైన ప్రిన్సిపాల్ ఆ ఇద్దరినీ తీవ్రంగా కొట్టాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఓ విద్యార్థి చనిపోగా, మరొకరికి గాయాలయ్యాయని చెప్పారు.

English summary
In a shocking incident, a Class III student was beaten to death by the principal of his school in Barabanki district of Uttar Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X