వైద్యం చేసేందుకు వచ్చి వివాహితపై రేప్ చేశాడు
ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది.
పశువులకు వైద్యం చేస్తానంటూ వచ్చి ఓ పశు వైద్యుడు పశువు కంటే హీనంగా ప్రవర్తించాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముజఫర్ నగర్ లోని కాతుబ్‌పూర్ అనే గ్రామంలో తమ గేదెకు వైద్యం చేసేందుకు రావాల్సిందిగా కోరడంతో రామ్ నివాస్ అనే పశువుల డాక్టర్ ఆ ఇంటికి వెళ్లాడు.

ఇంట్లో భర్త లేనిది చూసి 35ఏళ్ల గృహిణిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమెను గాయపర్చినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు బాధితురాలు పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడ్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇది ఇలా ఉండగా, ఓ 17ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. న్యూమండి ప్రాంతంలో నిందితులు సిద్ధార్థ్, మోహిత్, అంకిత్ లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications