ఎన్నికల గాలం!: అన్నింటిపై సుంకం తగ్గించిన చిదంబరం
న్యూఢిల్లీ: ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం సోమవారం లోకసభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. చిదంబరం బడ్జెట్ ప్రవేశ పెట్టడం ఇది తొమ్మిదోసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లు నేపథ్యంలో సీమాంధ్ర సభ్యుల ఆందోళన మధ్యనే చిదంబరం దీనిని ప్రవేశ పెట్టారు.
సీమాంధ్ర ఎంపీలు వెల్‌లోకి వెళ్లి నిరసన తెలిపారు. కనుమూరి బాపిరాజు, హర్ష కుమార్‌లో వెల్లోకి వెళ్లి జై సమైక్యాంధ్ర అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేంద్రమంత్రులు చిరంజీవి, కావూరి సాంబశివ రావు, పురంధేశ్వరి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, పళ్లం రాజులు ప్లకార్డులు పట్టుకొని తమ తమ స్థానాల వద్ద నిరసన తెలిపారు. వారి నిరసనల మధ్యే ప్రసంగం కొనసాగుతోంది.

ముఖ్యాంశాలు
బడ్జెట్ అంచనాలు 17,63,212 కోట్లు.
ప్రణాళికా వ్యయం 5,55,322 కోట్లు.
ప్రణాళికేతర వ్యయం 12,07,892 కోట్లు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంది.
భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు ఇంకా పటిష్టంగా ఉన్నాయి.
ద్రవ్య లోటు 4.6 శాతానికే పరిమితం అయింది.
జనవరి చివరి నాటికి ద్రవ్యోల్భం 5.5 శాతంగా ఉంది.
2013-14 నాటికి 255 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి.
2014 నాటికి 236 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి.
2013-14లో రూ.7 లక్షల 35వేల కోట్ల వ్యవసాయ రుణాలు.
2012-13లో 326 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి.
గత దశాబ్దిలో అంచనాల కంటే బారీగా ఉద్యోగ కల్పన
దిగాలు పడిన పారిశ్రామికోత్పత్తి సూచీలు ఆందోళన కలిగిస్తున్నాయి.
2011-12 ఆర్థిక సంవత్సరం నుంచి మందగమనం ప్రారంభం.
ఆహార ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ ఆందోళన కలిగిస్తోంది.
\పదేళ్ల క్రితం మొత్తం విద్యుదుతత్పత్తి లక్షా 20వేల మెగావాట్లు.
ప్రస్తుతం 2 లక్షల 44వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి పెరిగింది.
ఉన్నత విద్యకు కేటాయింపు రూ.79,459 కోట్లు కేటాయింపు
వైద్య రంగానికి రూ.36,300 కోట్లు.
1999-2004 నాటికి జిడిపి వృద్ధి రేటు 5.9 శాతం.
డీజిల్ ధరలను మార్కెట్‌కు అనుగుణంగా ఎప్పటికి అప్పుడు పరిశీలిస్తున్నాం.
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 67 శాతం మంది ప్రజలకు ఆహార భద్రత.
దేశంలో మరో మూడు తయారీరంగ పారిశ్రామిక జోన్లు
దేశంలో 50వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రాలు నిర్మాణంలో ఉన్నాయి.
మా ప్రభుత్వం విజయాలను చరిత్ర గుర్తిస్తుంది.
విదేశీ పెట్టుబడులకు సానుకూల వాతావరణం కల్పించాం.
45 బిలియన్ డాలర్లుగా కరెంటు ఖాతా లోటు.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు అంచనా 5.2 శాతం.
2013-14 మూడు, నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో ఆర్థిక వ్యవస్థ కోలుకుంది.
ఈశాన్య రాష్ట్రాలు, హిమాచల్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు అదనపు ఆదాయం రూ.1200కోట్లు.
అంతరిక్ష పరిశోధనల్లో ఇస్రోకు అదనపు సాయం.
రూ.1000కోట్లతో నిర్భయ ఫండ్.
యూపిఏ సగడు వృద్ధి రేటు సూచీలు ఎన్డీయే హయాం కంటే మెరుగ్గా ఉన్నాయి.
మూడు కోత్త మ్యాన్‌ఫ్యాక్చరింగ్ హబ్స్.
జాతీయ నైపుణ్య అభివృద్ధి పథకానికి రూ.వెయ్యి కోట్లు.
27 పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదలీ ప్రవేశ పెట్టాం.
ఆధార్‌కు ప్రభుత్వం కట్టుబడి ఉంది.
ఇప్పటికే 57 కోట్ల మంది ఆధార్‌లోకి వచ్చారు.
2013-14 నాటికి అభివృద్ధి రేటు అంచనా 4.9 శాతం.
మానవ వనరుల అభివృద్ధికి రూ.67 వేల కోట్లు.
తాగునీటి పథకానికి రూ.15,600కోట్లు.
పంచాయతీరాజ్‌కు రూ.7వేల కోట్లు.
రైల్వేలకు రూ.29వేల కోట్లు.
మహిళా శిశు సంక్షేమానికి రూ.21 కోట్లు.
హౌసింగ్ రంగానికి రూ.ఆరువేల కోట్లు.
ఒకే ర్యాంకు, ఒకే పెన్షన్ పథకానికి ప్రభుత్వం ఆమోదం.
ఫార్మా, విమానయన, మల్టీబ్రాండ్ రిటైల్ రంగంలో నిబంధనలు సరళతరం
2014-15లో 2.46 లక్షల కోట్లుగా సబ్సిడీలు
ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.11,200 కోట్లు
రక్షణ రంగానికి రూ.2.24 లక్షల కోట్లు
2014-15లో రూ.1.15 లక్షల కోట్లుగా ఆహార సబ్సిడీలు.
త్వరలో దేశవ్యాప్తంగా ప్రత్యక్ష నగదు బదలీ పథకం అమలు.
యూపిఏ 2 పాలనలో వ్యవసాయ రంగ అభివృద్ధి నాలుగు శాతం.
చక్కెర పరిశ్రమపై నియంత్రణలను పూర్తీగా తొలగిస్తాం.
రాష్ట్రాలకు ఇచ్చే సాయం రూ.1.38 లక్షల నుండి రూ.3.38 శాతానికి పెంపు.
2014-15లో 76వేల కోట్లుగా ఎరువుల రాయితీలు.
ఉన్నత విద్యకు రూ.79,459 కోట్ల కేటాయింపు
2016-17 నాటికి ద్రవ్యలోటును మూడు శాతానికి పరిమితం చేయగలం.
ఇంధన రాయితీలను 35వేల కోట్లకు తగ్గించుకోగలిగాం.
2.1 మంది గ్యాస్ వినియోగదారులకు రూ.3,370 రాయితీ.
స్వయం సహాయక బృందాల ద్వారా దేశంలో 41,16,000 మంది మహిళలకు రుణాలు అందించాం.
అన్ని రకాల మొబైల్ ఫోన్లపై ఎక్సైజ్ సుంకం తగ్గింపు.
అన్ని వస్తువులపై సుంకం 12 శాతం నుండి పదిశాతానికి తగ్గింపు
చిన్న కార్లపై సుంకం 12 శాతం నుండి 8 శాతానికి తగ్గింపు.
2009కి ముందు విద్యార్థుల రుణాలపై వడ్డీ మాఫీ.
విదేశాల్లో భారతీయ ఖాతాలపై లోతైన విచారణ.
14 కోట్ల మందిని పేదరికం నుండి బయటకు తీసుకొచ్చాం.












Click it and Unblock the Notifications