UPI Charges: పండుగల వేళ కేంద్రం ఊరట- ఛార్జీల మోతపై తాజా నిర్ణయం..!

దసరా, దీపావళి పండుగల సీజన్ లో యూపీఐ ఛార్జీల మోతను భరించేదెలా అని ఆందోళన చెందుతున్న యూజర్లకు కేంద్రం ఇవాళ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 15 నుంచి అమలు చేయాలని భావించిన యూపీఐ ఛార్జీలను (UPI Charges) వాయిదా వేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పండుగ సీజన్ లో 2 వేలకు మించిన యూపీఐ లావాదేవీలపై ఛార్జీల మోత మొదలుపెడితే వ్యాపారాలు గగ్గోలు పెడతారన్న ఆందోళనలు ఓవైపు, కస్టమర్లపై పడే ప్రభావం ఇంకోవైపు కేంద్రాన్ని ఈ నిర్ణయం తీసుకునేలా పురికొల్పాయి.

NO UPI Day: ఆ రోజు దేశవ్యాప్తంగా యూపీఐ చెల్లింపులు బంద్ ..! వ్యాపారుల నిర్ణయం..!
NO UPI Day: ఆ రోజు దేశవ్యాప్తంగా యూపీఐ చెల్లింపులు బంద్ ..! వ్యాపారుల నిర్ణయం..!

పండుగ సీజన్‌లో ఇబ్బందుల్ని నివారించడానికి యూపీఐ ఛార్జీల అమలును వాయిదా వేయవచ్చని ఇప్పటికే నివేదికలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ.. ఎంపిక చేసిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ అమలును దీపావళి తర్వాత వరకు వాయిదా వేసినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తెలిపింది. ఎంపిక చేసిన వ్యక్తి-నుండి-వ్యాపారి (P2M) లావాదేవీలపై ఎండీఆర్ ను దీపావళి తర్వాత వెంటనే అమలు చేయాలని యూపీఐ సేవల స్టీరింగ్ కమిటీ నిర్ణయించింది. ఏ రోజు నుంచి ఈ ఛార్జీలు అమల్లోకి వస్తాయన్నది త్వరలో ప్రకటిస్తారు.

UPI Fee on Merchant Transactions Above Rs 2 000 Likely After Diwali
రైల్వే టికెట్లపై యూపీఐ ఛార్జీలు?- అక్టోబర్ 15 నుంచి కొొత్త రూల్..!
రైల్వే టికెట్లపై యూపీఐ ఛార్జీలు?- అక్టోబర్ 15 నుంచి కొొత్త రూల్..!

అంతకు ముందు అక్టోబర్ 15 నుండి అమల్లోకి రావాల్సి ఉన్న యూపీఐ ఛార్జీలను వాయిదా వేయాలని వ్యాపార సంఘాలు, ఫిన్‌టెక్ సంస్థలు, చెల్లింపుల కంపెనీలు కేంద్రాన్ని కోరాయి. ఈ అభ్యర్థనలపై NPCI పరిశీలిస్తోందన్న వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. పండుగ షాపింగ్ సీజన్‌లో వ్యాపారులు, వినియోగదారులపై పడే ప్రభావంపై ఆందోళనల నేపథ్యంలో, ఈ అమలును జనవరి 2027 వరకు వాయిదా వేయాలని ఎన్పీసీఐ భావిస్తోందని కూడా గతంలో కథనాలు వచ్చాయి. కానీ అంతవరకూ అంటే కష్టమని భావించిన ఎన్సీపీఐ దీపావళి తర్వాతే అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే యూపీఐ ఇంటర్ ఫేస్ నిర్వహణకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకపోవడం భారంగా మారిందని కేంద్రం చెబుతోంది. యూజర్ల నుంచి ఈ ఛార్జీలు వసూలు చేసినా నష్టాల్ని పూరించుకునే పరిస్ధితి లేదని, కేంద్రం అదనపు నిధులు అందించాలని ఎన్సీపీఐ కోరుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+