UPI Payments: యూపీఐ ఛార్జీలపై కేంద్రం తాజా క్లారిటీ- ఎప్పటి నుంచో తెలుసా ?

దేశవ్యాప్తంగా ఏటికేడాది పెరుగుతున్న యూపీఐ చెల్లింపుల (UPI Payments) వల్ల వీసా, మాస్టర్ కార్డ్ వంటి అమెరికా ఉత్పత్తులకు నష్టం వాటిల్లుతుందన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో 2 వేలకు పైగా విలువైన యూపీఐ చెల్లింపులకు ఛార్జీలను (UPI Charges) వర్తింపచేయాలని నిర్ణయించింది. అయితే 2 వేలు దాటిన లావాదేవీలపై ఛార్జీలు విధించాలన్న నిర్ణయంపై విపక్షాలతో పాటు సాధారణ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో కేంద్రం ఇవాళ మరో కీలక ప్రకటన చేసింది.

UPI Charges: అప్పుడు జీఎస్టీ, టీడీఎస్ - ఇప్పుడు యూపీఐ ..! జనం ఆందోళన వెనుక ?
UPI Charges: అప్పుడు జీఎస్టీ, టీడీఎస్ - ఇప్పుడు యూపీఐ ..! జనం ఆందోళన వెనుక ?

2 వేలు దాటిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం ఛార్జీలు విధిస్తామని, అయితే ఈ ఛార్జీల్ని వినియోగదారులు చెల్లించాల్సిన అవసరం లేదని, వ్యాపారులే చెల్లిస్తారని కూడా కేంద్రం వెల్లడించింది. వినియోగదారులకు ప్రస్తుతం ఉన్న విధంగానే యూపీఐ సేవలు ఉచితంగానే అందుబాటులో ఉంటాయని 'నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా' స్పష్టం చేసింది. సవరించిన యూపీఐ మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధానం అక్టోబర్ 15 నుండి అమల్లోకి రానుందని కూడా ప్రకటించింది.

UPI Payments Above 2 000 to Attract Charges From October 15 Consumers Won t Pay
సీఎం పోస్టుకు రాజీనామా-గవర్నర్ కు లేఖ..! మోడీకి థ్యాంక్స్ చెప్పిన అభిజీత్ దిప్కే..!
సీఎం పోస్టుకు రాజీనామా-గవర్నర్ కు లేఖ..! మోడీకి థ్యాంక్స్ చెప్పిన అభిజీత్ దిప్కే..!

కేంద్రం వాదన ఎలా ఉన్నా.. యూపీఐ చెల్లింపులు చేసేటప్పుడు అవి 2 వేలు మించితే వ్యాపారులపై భారం పడినా, వారు తిరిగి వినియోగదారులపైనే దాన్ని మోపుతారు. ఇదే అంశాన్ని విపక్షాలు పదే పదే ప్రస్తావిస్తున్నా కేంద్రం మాత్రం నేరుగా భారం పడటం లేదని వాదిస్తోంది. ఇప్పుడు నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఎన్సీపీఐ కూడా వినియోగదారులపై ఎలాంటి భారం పడదని చెబుతోంది. కానీ వ్యాపారులు తమపై పడే చిన్న భారాన్ని కూడా వినియోగదారులపై బదిలీ చేయడం మొదలుపెడితే యూపీఐ లావాదేవీలు నెమ్మదించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+