ఫోన్ పే, గూగుల్ పే వాడేవారికి కేంద్రం బిగ్ షాక్..? రూ. 3 వేలకుపైగా పేమెంట్ చేస్తే..?
2016 నవంబరి 8.. దేశ ఆర్థికరంగంలో సంచలనం సృష్టించిన రోజు. అదే రోజున కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత డిజిటల్ పేమెంట్స్ ఊపందుకున్నాయి. గల్లీలోని కిరాణా షాపు నుంచి దిల్లీ లోని షాపింగ్ మాల్స్ వరకు ఇప్పుడు అంతా యూపీఐ పేమెంట్స్ హవా నడుస్తోంది. పాలు, పెరుగు, ఛాయ్, కూరగాయలు దగ్గరనుంచి విలువైన బంగారు ఆభరణాలు, వజ్రాలు కొనుగోలు వరకూ అన్నీ ఫోన్ పే, గూగుల్ పే ద్వారానే చెల్లింపులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం.
ప్రస్తుతం దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ యూపీఐ పేమెంట్స్ నడుస్తున్నాయి. ఇంట్లోనే ఉండి కోరుకున్న వ్యక్తికి ఫోన్ నంబర్ సాయంతో నగదు పంపించొచ్చు. ఎంత ఎమౌంట్ అయినా చిటికెలో పంపించొచ్చు. దీనికి ప్రత్యేకమైన ట్యాక్స్ లు ఏమీ ఉండేవి కావు. అయితే కేంద్ర ప్రభుత్వం యూపీఐ చెల్లింపులపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం అందుతోంది. యూపీఐ ద్వారా రూ.3 వేలకు పైబడిన లావాదేవీలపై ఛార్జీలు విధించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రం తీసుకోబోతున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా లక్షలాది మంది వినియోగదారులపై ప్రభావం చూపనుంది.
ఫోన్ పే, గూగుల్ పే, ఇతర యూపీఐల ద్వారా రూ.3 వేలకుపైగా చేసే లావాదేవీలపై ఛార్జీలు విధించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం అందుతోంది. అయితే చిన్న మొత్తాల యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీల మినహాయింపు కొనసాగే అవకాశం ఉనట్లు తెలుస్తోంది. పెద్ద వ్యాపారులపై 0.3 శాతం ఎండీఆర్ విధించాలని పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PCI) కేంద్రానికి ప్రతిపాదనలు చేసింది. ప్రస్తుతం క్రెడిట్, డెబిట్ కార్డులపై ఎండీఆర్ 0.9 శాతం నుంచి 2 శాతం వరకు ఉంది. ఇక రూపే కార్డులపై ప్రస్తుతానికి ఎండీఆర్ విధించే ఆలోచన లేనట్లు సమాచారం.

యూపీఐల ద్వారా రూ.3 వేలకుపైగా చేసే లావాదేవీలపై ఛార్జీలను మరో రెండు మూడు నెలల్లో విధించనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతున్న ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా లక్షలాది మంది డిజిటల్ పేమెంట్స్ యూజర్లపై ప్రభావం పడనుంది.












Click it and Unblock the Notifications