ఢిల్లీలో ఉప్పెన సినిమా సీన్ రిపీట్; ప్రేమపెళ్లి చేసుకున్నందుకు మర్మాంగాలు కోసేసిన యువతి కుటుంబం

దేశ రాజధాని ఢిల్లీ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉప్పెన సినిమా సీన్ రిపీట్ అయ్యింది. ప్రేమించిన ఖర్మానికి ఓ యువకుడు చిత్రహింసలకు గురయ్యాడు. ప్రేమ వివాహం చేసుకున్నందుకు ఏకంగా యువకుడి మర్మాంగాన్ని కోసేసిన దారుణ ఘటన సభ్యసమాజాన్ని షాక్ కు గురి చేసింది .

ప్రేమపెళ్లి .. యువకుడికి శాపంగా మారిన ఘటన

ప్రేమపెళ్లి .. యువకుడికి శాపంగా మారిన ఘటన

దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా దారుణ ఘటన చోటు చేసుకుంది. అత్యంత క్రూరమైన షాకింగ్ సంఘటనలో, ప్రేమించి పెళ్లి చేసుకోవడమే ఆ యువకుడికి శాపంగా మారింది. ఢిల్లీకి చెందిన ఓ యువకుడు ఓ యువతి ప్రేమించుకున్నారు. ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. ఒకరిని వదిలి ఒకరు ఉండలేకపోయారు. వీరి పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు నిరాకరించడంతో, ఇద్దరు ఎటైనా వెళ్లి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. పెళ్లి జరిగితే వాళ్ళే తర్వాత ఒప్పుకుంటారు అనుకున్నారు. ప్లాన్ ప్రకారం వారిద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోయి డిసెంబర్ 22 వ తేదీన ప్రేమ వివాహం చేసుకున్నారు.

యువకుడిని కిడ్నాప్ చేసి,దాడి చేసి మర్మాంగం కోసేసిన యువతీ బంధువులు

యువకుడిని కిడ్నాప్ చేసి,దాడి చేసి మర్మాంగం కోసేసిన యువతీ బంధువులు

పెళ్లి చేసుకున్న తర్వాత ఆ జంట డిసెంబర్ 22 వ తేదీన ఢిల్లీకి చేరుకుంది. పెళ్లి చేసుకున్న కోపంలో ఉంటారు కాబట్టి ఏమైనా చేస్తారేమో అన్న భయంతో యువతి కుటుంబ సభ్యుల నుండి తనకు ప్రాణహాని ఉందని రాజౌరీ పోలీస్ స్టేషన్ ను రక్షణ కల్పించాలని కోరారు ఆ కొత్త జంట. ఇక ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ నుండి యువకుడు బయటకు రాగానే అతడిని కిడ్నాప్ చేశారు. అతడిని ఎవరూ లేని చోటికి తీసుకెళ్ళి హింసించారు. ఆపై అతని పై తీవ్రంగా దాడి చేసి, అతని మర్మాంగాన్ని కోసేశారు.

వద్దన్నా.. విలవిలలాడుతున్నా పాశవిక దాడి .. మర్మాంగం కోసేసిన ఘటన

వద్దన్నా.. విలవిలలాడుతున్నా పాశవిక దాడి .. మర్మాంగం కోసేసిన ఘటన

తమ కుమార్తె కావాల్సి వచ్చిందా అంటూ పశువుల్లా దాడి చేశారు. వద్దని విలవిలలాడుతున్నా నిర్దాక్షిణ్యంగా యువకుడి మర్మాంగాన్ని కోసేశారు. తీవ్ర గాయాలపాలైన యువకుడిని సప్దార్ జంగ్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న యువతి ఈ విషయం తెలిసి షాక్ కు గురయ్యింది. తనను పెళ్లి చేసుకున్నందుకు అతని జీవితం ఇలా అయిపోయిందని కన్నీరు మున్నీరవుతుంది.

కేసు నమోదు చేసిన పోలీసులు ... దర్యాప్తు

కేసు నమోదు చేసిన పోలీసులు ... దర్యాప్తు

డిసెంబరు 22న ఢిల్లీలోని రాజౌరీ గార్డెన్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటన అందరిని ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. ఇక ఈ కేసులో హత్యాయత్నం, అపహరణకు సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు అదనపు డీసీపీ (పశ్చిమ) ప్రశాంత్‌ గౌతమ్‌ తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసులు ఎవరినీ అరెస్టు చేయలేదని తెలుస్తోంది. బాధితుడి కుటుంబం దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చెయ్యాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. గతంలోనూ ఇలాంటి అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రేమించారన్న కోపంతో విపరీతమైన ఆగ్రహంతో విచక్షణ మరిచి చాలా మంది ఇలాంటి ఘటనలకు పాల్పడ్డారు. అత్యంత రాక్షసంగా మర్మాంగంపై దాడి చేసి ప్రాణాలు తీశారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనే ఇలాంటి ఘటన తాజాగా చోటు చేసుకోవటం దారుణం .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+