సివిల్స్‌ 2016 ఫలితాలు: టాపర్ కేఆర్ నందిని, ఏకే ఖాన్ కుమారుడికి 22వ ర్యాంకు

సివిల్‌ సర్వీసెస్‌- 2016 పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఈ అఖిల భారత సర్వీస్‌లో కర్ణాటకకు చెందిన కేఆర్ నందిని మొదటి స్థానంలో నిలిచింది.

న్యూఢిల్లీ: సివిల్‌ సర్వీసెస్‌- 2016 పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఈ అఖిల భారత సర్వీస్‌లో కర్ణాటకకు చెందిన కేఆర్ నందిని మొదటి స్థానంలో నిలిచింది. అన్మోల్‌ షేర్ సింగ్ బేడీ రెండో స్థానంలో, రోనాన్కీ మూడవ స్థానంలో నిలిచారు. మొత్తం 1099 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.

టాప్ - 10 ర్యాంకర్లలో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, కేంద్ర సర్వీసులు, గ్రూప్ ఏ, గ్రూప్ బి సర్వీసులకు వీరు ఎంపికయ్యారు.500 మంది జనరల్ కేటగిరీలో ఎంపిక కాగా, 347 మంది ఓబీసీ, 163 మంది ఎస్సీ, 89 మంది ఎస్టీ విభాగాలలో ఎంపిక అయ్యారు.

UPSC 2016 results declared: Karnataka girl Nandini KR tops, 1,099 candidates qualify

తొలి పదిస్థానాల్లో వీరే...

1. నందిని కె.ఆర్‌, 2. అన్మోల్‌ షేర్‌సింగ్‌ బేడి, 3. గోపాలకృష్ణ రోనన్కి, 4. సౌమ్యా పాండే, 5. అభిలాష్‌ మిశ్రా, 6. కొత్తమాసు దినేశ్‌కుమార్‌, 7. ఆనంద్‌ వర్ధన్‌, 8. శ్వేతా చౌహన్‌, 9. సుమన్‌ సౌరవ్‌ మహంతి, 10. బిలాల్‌ మొహిద్దీన్‌ భట్‌.

UPSC 2016 results declared: Karnataka girl Nandini KR tops, 1,099 candidates qualify

ఏకే ఖాన్ కుమారుడికి 22వ ర్యాంకు...

ఈ సారి రంజాన్ మాసం మాజీ ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్ ఇంట్లో ఆనందాన్ని పంచింది. ఏకే ఖాన్ కుమారుడు ముజామిల్ ఖాన్‌ సివిల్స్‌ -2016 తుది ఫలితాల్లో సత్తా చాటారు. సివిల్స్‌లో ఆయన దేశ వ్యాప్తంగా 22వ ర్యాంకు సాధించారు. ముజామిల్ ఖాన్‌కు తెలంగాణలో తొలి ర్యాంకు కావడం విశేషం.

UPSC 2016 results declared: Karnataka girl Nandini KR tops, 1,099 candidates qualify

ఇండియాలో 22వ ర్యాంకు సాధించడం పట్ల ముజామిల్ ఖాన్ ను పలువురు అభినందించారు. 2016 సివిల్స్‌ ఫలితాలతో పాటుగా గ్రూప్‌-ఏ, బీ ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. ఈ పరీక్షల్లో మొత్తం 1099 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు యూపీఎస్సీ పేర్కొంది.

UPSC 2016 results declared: Karnataka girl Nandini KR tops, 1,099 candidates qualify
UPSC 2016 results declared: Karnataka girl Nandini KR tops, 1,099 candidates qualify
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+