Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

UPSC:సివిల్స్ పరీక్షలకు కొవిడ్ దెబ్బ -జూన్27న జరగాల్సిన ప్రిలిమ్స్ అక్టోబర్ 10కి వాయిదా

దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి ప్రమాదకరంగా సాగుతున్నది. ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీ స్థాయిల పరీక్షలన్నీ దాదాపుగా రద్దయిపోయాయి. ఇప్పుడు కొవిడ్ దెబ్బకు అత్యున్నత ప్రభుత్వ సర్వీసులైన సివిల్స్ కూడా ఎఫెక్టయింది. కరోనా వైరస్ ఉద్ధృతి దృష్ట్యా యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్‌ పరీక్షలను వాయిదా వేసింది.

యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు ఈ ఏడాది జూన్‌ 27న జరగాల్సి ఉండగా, వైరస్ వ్యాప్తి ఇప్పట్లో తగ్గేపరిస్థితి లేకపోవడంతో పరీక్షను అక్టోబర్‌ 10కి వాయిదా వేసినట్లు కమిషన్‌ గురువారం వెల్లడించింది. గతేడాది కూడా కరోనా విలయ తాండవంతోనే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. మే 31న జరగాల్సిన ఈ పరీక్షలను కరోనా నేపథ్యంలోనే అక్టోబర్‌ 4కు రీషెడ్యూల్‌ చేశారు.

UPSC Civil Services Preliminary Examination Postponed to October 10 from June 27 due to covid

ప్రస్తుతానికి రాత పరీక్షలు పూర్తయినప్పటికీ.. ఇంటర్వ్యూలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు, ప్రస్తుతం వైరస్‌ విజృంభిస్తుండటంతో యూపీఎఎస్సీఅన్ని పరీక్షలను వాయిదా వేసింది. ఈపీఎఫ్‌వోలో ఇన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీ కోసం మే 9న జరగాల్సిన పరీక్షను వాయిదా వేసింది. వాయిదా వేసిన పరీక్షలు/ ఇంటర్వ్యూల తదుపరి తేదీలపై అభ్యర్థులకు కనీసం 15 రోజుల ముందుగానే సమాచారం ఇవ్వనున్నట్టు కమిషన్‌ తెలిపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+