UPSC CSE Result 2023 : యూపీఎస్సీ మెయిన్స్ ఫలితాలు విడుదల- 933 అభ్యర్ధుల ఎంపిక..

ఈ ఏడాది సివిల్ సర్వీసెస్ పరీక్ష మెయిన్స్ పరీక్ష ఫలితాలు, ఈ ఏడాది జనవరి నుంచి మే వరకూ జరిగిన పర్సనాలిటీ టెస్ట్ కోసం నిర్వహించిన ఇంటర్వ్యూల ఫలితాలు ఇవాళ వెలువడ్డాయి. ఇందులో మొత్తం 933 మందిని ఉద్యోగాల కోసం యూపీఎస్సీ సిఫార్సు చేసింది. జాతీయ స్ధాయిలో టాప్ 4 స్ధానాల్ని మహిళలే దక్కించుకున్నారు. అఖిల భారత ర్యాంకుల్లో టాప్ 1లో ఇషియా కిషోర్, గరిమా లోహియా రెండో ర్యాంక్ సాధించారు.

గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2022, జనవరి-మే 2023లో జరిగిన పర్సనాలిటీ టెస్ట్ కోసం ఇంటర్వ్యూల ఫలితాల ఆధారంగా నియామకానికి సిఫార్సు చేయబడిన అభ్యర్థుల మెరిట్ జాబితాను యూపీఎస్సీ ఇవాళ ప్రకటించింది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ 'ఎ', గ్రూప్ 'బి'కి నియామకం కోసం మొత్తం 933 మంది అభ్యర్థుల్ని సిఫార్సు చేశారు.

 upsc-

యూపీఎస్సీ సిఫార్సు చేసిన 933 మంది అభ్యర్థుల్లో 345 మంది జనరల్ కేటగిరీకి చెందినవారు కాగా.. 99 మంది ఈడబ్ల్యూఎస్ కోటా, 263 మంది ఓబీసీ కోటా, 154 మంది ఎస్సీ కోటా, 72 మంది ఎస్టీ కోటా వారు ఉన్నారు. ఏకీకృత రిజర్వ్ జాబితాలో 178 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరిలో ఏఎస్‌కు 180, ఐఎఫ్‌ఎస్‌కు 38, ఐపీఎస్‌కు 200, సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ 'ఎ'కి 473, గ్రూప్ 'బి' సర్వీసులకు 131 ఖాళీల సంఖ్యను భర్తీ చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+