110 ఫారెస్ట్ ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్: అప్లై చేయండి

Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కమిషన్‌లో 110 ఉద్యోగాల భర్తీ కోసం యూపీఎస్సీ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగార్థులు ఫిబ్రవరి 07, 2018 నుంచి మార్చి 06, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.

కమిషన్ పేరు: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్

పోస్టు పేరు: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2018

ఖాళీల సంఖ్య: 110

జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.

చివరి తేదీ: మార్చి 06, 2018

విద్యార్హతలు: కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా పార్లమెంటు చట్టం, 1956 గ్రాంట్స్ కమిషన్ యాక్ట్ ద్వారా ఏర్పడిన విద్యా సంస్థ నుంచి ఎనిమల్ హస్బండరీ, వెటర్నరీ సైన్స్, బాటనీ, కెమిస్ట్రీ, జియోలజీ, మేథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, జువాలజీ వీటిలో ఒక్కటైనా సబ్జెక్ట్ కలిగిన బ్యాచిలర్ డిగ్రీ లేదా అగ్రికల్చర్, ఫారెస్ట్రీ బ్యాచిలర్ డిగ్రీ లేదా ఇంజినీరింగ్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.

వయో పరిమితి: ఆగస్టు 01, 2018 నాటికి అభ్యర్థి వయస్సు 21ఏళ్లకు తక్కువగా ఉండకూడదు, 32ఏళ్లకు ఎక్కువగా ఉండకూడదు. ఆగస్టు 02, 1986కు ముందు పుట్టి ఉండకూడదు, ఆగస్టు 01, 1997తర్వాత పుట్టి ఉండకూడదు.

ముఖ్యమైన తేదీ:

రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 07.02.2018

రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 06.03.2018

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
UPSC recruitment 2018 notification has been released on official website for the recruitment of 110 (one hundred ten) vacancies for Indian Forest Service Examination 2018. Job seekers should apply from 07th February 2018 and before 06th March 2018.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి