Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యూరీ ఉగ్రదాడి: ఆధారాలు చూపి ‘పాక్’ కు సమన్లు జారీ

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లోని యూరీ సెక్టార్ సైనిక శిబిరంపై జరిపిన ఉగ్రదాడి ఘటనకు సంబంధించి పాకిస్తాన్‌కు భారత్ సమన్లు జారీ చేసింది. భారత విదేశాంగ కార్యదర్శి ఎస్. జయశంకర్ భారత్‌లోని పాక్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్‌ను తన కార్యాలయానికి పిలిపించుకుని ఈ సమన్లు జారీ చేశారు.

సౌత్ బ్లాక్‌లోని క్యాబినెట్ సెక్రటేరియట్‌లో ఇరు దేశాలకు చెందిన నేతలు సమావేశమయ్యారు. యూరీ ఉగ్రదాడిలో పాకిస్థాన్ పాత్రపై ఆధారాలను బాసిత్‌కు అందజేశారు. ఈ ఉగ్రదాడిలో భారత జవాన్ల చేతిలో హతమైన నలుగురు ఉగ్రవాదుల వద్ద లభించిన గ్రనేడ్లు, ఆహార ప్యాకెట్లు, దుస్తులు, మందులపై పాకిస్థాన్ గుర్తులు ఉన్నాయని ఆయనకు చూపించారు.

Uri attack: India summons Pakistan envoy Abdul Basit, offers evidence

అవసరమైతే ఉగ్రవాదుల వేలిముద్రలు, డిఎన్‌ఏ వివరాలూ ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు. దాడికి సూత్రధారులను శిక్షించాలని కోరారు. పాకిస్థాన్ నియంత్రిత భూభాగంలో భారత్ పై ఉగ్ర దాడికి పాల్పడే ఎవ్వరికీ అనుమతి ఇవ్వవద్దనే నిబంధనకు తమ దేశం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా బాసిత్ వెల్లడించినట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Pakistan envoy Abdul Basit

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+