భారత విమానాలు సురక్షితం, భద్రతా ర్యాంకింగ్‌ను పెంచిన అమెరికా
న్యూఢిల్లీ: భద్రతా ప్రమాణాల్లో మెరుగైన పనితీరును కనబరుస్తూ, ప్రమాదాలకు దూరంగా ఉంటున్న భారత విమానయాన భద్రతా ర్యాంకింగ్‌ను పెంచుతున్నట్లు అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న కేటగిరీ 2 నుంచి కేటగిరీ 1కు మార్చింది.
14 నెలల క్రితం సరైన భద్రతా ప్రమాణాలు పాటించడం లేదంటూ కేటిగిరీ 2కు మార్చిన విషయం తెలిసిందే. అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని లెటర్ రూపంలో భారత వైమానికి శాఖకు అందింది. దీనిపై విమానయానశాఖ మంత్రి అశోక్ గజపతిరాజు స్పందిస్తూ.. భద్రతా ప్రమాణాల్లో కేటగిరీ 1 కి రావడం సంతోషంగా ఉందన్నారు.

ప్రాథమిక ఏవియేషన్ చట్టం, నిర్దిష్ట ఆపరేటింగ్ నిబంధనలు, రాష్ట్ర పౌర విమానయాన వ్యవస్థలు మరియు విధులు, అర్హత సాంకేతిక సిబ్బంది మరియు వారి శిక్షణ, సాంకేతిక మార్గదర్శకత్వం, లైసెన్సింగ్, ధ్రువీకరణ లాంటి వాటిపై గత ఏడాది డిసెంబర్‌లో ఆడిట్ చేసిన అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అథారిటీ భారత భద్రతా ర్యాంకింగ్‌ను 2కు మార్చింది.
అయితే గత నెలలో చేసిన ఆడిట్‌లో భారత విమానయానయాన రంగం భద్రతా ప్రమాణాల్లో మెరుగైన పనితీరును కనబరుస్తూ, ప్రమాదాలకు దూరంగా ఉండటంతో తాజా నిర్ణయం తీసుకుంది. కాగా, ఈ తాజా నిర్ణయంతో భారత విమానయాన సంస్ధలైన ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్‌వేస్ అమెరికాతో పాటు ప్రపంచంలోని మరికొన్ని నగరాలకు తమ సేవలను విస్తరించేందుకు మార్గం సుగమమైంది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications