వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతరించిపోతున్న జీవుల జాబితాలో భారతీయ సింహం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/న్యూయార్క్: భారత్‌, ఆఫ్రికాల్లో ఉన్న ప్రత్యేక జాతికి చెందిన సింహాల్ని.. అమెరికా అంతరించిపోతున్న జీవుల జాబితాలో చేర్చింది. ‘ద యూఎస్‌ ఫిష్‌ అండ్‌ వైల్డ్‌లైఫ్‌ సర్వీస్‌' సంస్థ దీనికి సంబంధించిన విషయాల్ని వెల్లడించింది.

భారత్‌, పశ్చిమ, మధ్య ఆఫ్రికాల్లో మాత్రమే ఉన్న పాంథెరా లియో లియో జాతికి చెందిన సింహాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోందని చెప్పింది. సంస్థ డైరెక్టర్‌ డాన్‌ ఆషే ఈ విషయమై మాట్లాడుతూ... ఈ సింహాల్ని ప్రపంచం అంతా ఎంతో ఇష్టపడుతుందని చెప్పారు.

US places Indian lion in endangered species list

అయితే ఇవి మాయమైతే ప్రపంచ వారసత్వ సంపదలో వీటి స్థానాన్ని ఇంకేవీ భర్తీ చెయ్యలేవన్నారు.

‘ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు 1400 సింహాలు మాత్రమే జీవించి ఉన్నాయి. 14ఆఫ్రికా దేశాల్లో 900, భారతదేశంలో 523 సింహాలున్నాయి. ప్రస్తుత వీటి సంఖ్య తగ్గే ప్రమాదం పొంచివుంది' అని పేర్కొన్నారు.

English summary
The US will place a breed of lion found in India and Africa in the endangered species list in a bid to curb the dramatic decline of their population.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X