మాల్దీవుల్లో ఎమర్జెన్సీ: మోడీకి ట్రంప్ ఫోన్, ఏం మాట్లాడారంటే..?
వాషింగ్టన్/న్యూఢిల్లీ: మాల్దీవుల్లో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత ప్రధాని నరేంద్ర మోడీతో ఫోన్లో మాట్లాడారు. ఇరు దేశాధినేతల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ గురించి వైట్ హౌస్ వెల్లడించింది.
మాల్దీవుల్లో నెలకొన్న పరిస్థితులపై ఇరు దేశాధినేతలు ఆందోళన వ్యక్తం చేసినట్లు వైట్‌హౌస్ పేర్కొంది. ప్రజాస్వామ్య సంస్థలు, చట్టపరమైన పాలనను గౌరవించాల్సిన అవసరం ఉందని నేతలు స్పష్టం చేసినట్లు తెలిపింది.

15రోజులపాటు ఎమర్జెన్సీ
మాల్దీవులు అధ్యక్షుడు యమీన్.. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేసి 15రోజులపాటు అత్యవసర పరిస్థితి ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేగాక, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు మరో న్యాయమూర్తిని కూడా అరెస్ట్ చేయించారు.

సుప్రీం సీజే, మాజీ దేశాధ్యక్షుడి అరెస్ట్
అంతకుముందే మాజీ దేశాధ్యక్షుడు గయూంను కూడా యమీన్ అరెస్ట్ చేయించారు. రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, పార్టీ మారిన ఎంపీల సభ్యత్వాలను పునరిద్ధరించడానికి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను యమీన్ నిరాకరించిన విషయం తెలిసిందే.

ఎమర్జెన్సీ అంశంపై ఫోన్
ఈ నేపథ్యంలో ట్రంప్.. మోడీకి ఫోన్ చేసి మాల్దీవుల ఎమర్జెన్సీ అంశంతోపాటు ఇతర అంశాలపై మాట్లాడారు. మయన్మార్ అంశం, రోహింగ్యా శరణార్థుల గురించి కూడా చర్చించారు.

ఉత్తరకొరియాపైనా చర్చ
ఉత్తరకొరియా అణ్వస్త్ర ప్రయోగాల గురించి, ఉ. కొరియాను అణ్వాయుధాల విషయంలో నియంత్రించగలిగే అంశంపై మోడీ, ట్రంప్ చర్చించారు. ఆఫ్ఘనిస్థాన్ భద్రత విషయంలో సహకారానికి కట్టుబడి ఉన్నామని ట్రంప్ ఈ సందర్భంగా తెలిపినట్లు వైట్ హౌస్ పేర్కొంది.
-
కుప్పకూలుతున్న అమెరికా ఫైటర్ జెట్స్.. వెనక్కు తగ్గిన ట్రంప్..!! -
తోకముడిచిన ట్రంప్, అమెరికా పరువు తీసిన ఇరాన్ రియాక్షన్ -
Donald trump: ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన చమురు, గ్యాస్ ధరలు..! -
ట్రంప్ కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి-ఎలాగో చెప్పిన మాజీ రక్షణమంత్రి..! -
Trump: ట్రంప్ ప్రకటనపై స్పందించిన కేంద్రం- కీలక వ్యాఖ్యలు..! -
ఇజ్రాయెల్ కు షాకిచ్చిన ట్రంప్, ఇప్పుడు ఏం చేద్దాం? -
యుద్ధం ఆగిపోయింది. ట్రంప్ సంచలన ప్రకటన -
షాకింగ్ వీడియో: అమెరికా F-15 ఫైటర్ జెట్ ను పేల్చేసిన ఇరాన్ -
Iran: ట్రంప్ అల్టిమేటం వేళ హార్ముజ్ పై ఇరాన్ కీలక నిర్ణయం-ఆ కండిషన్ తో ..! -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్ -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే!










Click it and Unblock the Notifications