వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌కు అమెరికా భారీ సాయం -ప్రధాని మోదీతో బైడెన్ మంత్రి బ్లింకెన్ భేటీ -ఏం చర్చించారంటే..

|
Google Oneindia TeluguNews

భారత ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగంగా అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ ట్రంప్ తరఫున ప్రచారం చేయడం, చివరికి డెమోక్రాట్ జో బైడెన్ అధ్యక్షుడైన తర్వాత కొన్నాళ్ల పాటు ఊగిసలాడిన అమెరికా-భారత్ బంధాలు మళ్లీ గాడినపడుతున్నాయి. బైడెన్ టీమ్ లో ముఖ్యుడు, అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తొలిసారి భారత్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అగ్ర రాజ్యం భారీ అదనపు సహాయాన్ని ప్రకటించింది..

ఎంపీ రఘురామ పరారీకి రంగం సిద్ధం -చంద్రబాబు పక్కా స్కెచ్ -మిగిలేది ఇద్దరే: వైసీపీ సాయిరెడ్డిఎంపీ రఘురామ పరారీకి రంగం సిద్ధం -చంద్రబాబు పక్కా స్కెచ్ -మిగిలేది ఇద్దరే: వైసీపీ సాయిరెడ్డి

కరోనా విలయం నేపథ్యంలో భారత్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియకు భారత్ మరికొంత సహాయాన్ని ప్రకటించింది. ఇంతకు ముందు అందించి దానికంటే అదనంగా ఇప్పుడు 25 మిలియన్​ డాలర్లు(రూ.186 కోట్లు) సాయం కింద అందిస్తున్నట్లు బుధవారం ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకన్ తెలిపారు. గతేడాది జూన్​లో 41 మిలియన్​ డాలర్లను అమెరికా భారత్​ కు సాయంగా అందించిన విషయం తెలిసిందే. తాము ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న భారత్​కు అండగా నిలుస్తామని యూఎస్​ ఏజెన్సీ ఫర్​ ఇంటర్నేషనల్​ డెవలప్​మెంట్​ తెలిపింది. ఇక,

US Secy of State Antony Blinken Meets PM Modi, announces $25 million covid support

రెండు రోజుల భారత పర్యటనకు వచ్చిన బ్లింకెన్​.. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. బ్లింకన్ తో భేటీ అనంతరం ప్రధాని మోదీ ఓ ట్వీట్ లో..ఈ రోజు అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్‌ను కలవడం చాలా బాగుంది. భారత్-యూఎస్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి అధ్యక్షుడు జో బైడెన్ యొక్క బలమైన నిబద్ధతను స్వాగతిస్తున్నట్లు మోదీ తెలిపారు. అంతకుముందు,

జగన్ వేడుకున్నా వినని ప్రధాని మోదీ -మరో లేఖాస్త్రం -ఏపీలో 3వ వేవ్ భయాలు -కరోనాపై సీఎం కీలక ఆదేశాలుజగన్ వేడుకున్నా వినని ప్రధాని మోదీ -మరో లేఖాస్త్రం -ఏపీలో 3వ వేవ్ భయాలు -కరోనాపై సీఎం కీలక ఆదేశాలు

Recommended Video

Corbevax: Biological E's COVID-19 Vaccine To Be Launched By September | Oneindia Telugu

ప్రధాని మోదీతో భేటీకి ముందు బ్లింకెన్.. భారత విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తోనూ సమావేశమయ్యారు. భార‌త్-అమెరికా దేశాల బంధం బ‌ల‌మైన‌ద‌ని బ్లింకెన్ వ్యాఖ్యానించారు. ప్ర‌పంచంలోని ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేయడంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్‌, అమెరికా కీలక భూమిక పోషించగలవని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.స్వేచ్ఛ, సమానత్వంపట్ల ఇరుదేశాలు తమ బాధ్యతలను నిర్వర్తించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయన్నారు. వ్యూహాత్మక, ఆర్థిక సంబంధాలకు మించి వీటికి ఎంతో ప్రాధాన్యత ఉందని ఆంటోని బ్లింకెన్ పేర్కొన్నారు. భారత ప్రజాస్వామ్యం పౌరుల స్వేచ్ఛాయుత ఆలోచనలతో కూడుకున్నదని వ్యాఖ్యానించారు.

English summary
US Secretary of State Antony Blinken held talks with Prime Minister Narendra Modi today. “Good to meet US Secretary of State Antony Blinken today. I welcome President Joe Biden’s strong commitment to strengthen the India-US Strategic Partnership, which is anchored in our shared democratic values and is a force for global good,” said Modi after the meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X