Arvind Kejriwal అరెస్ట్ పై తగ్గని యూఎస్.. ఫ్రీజ్ చేసిన కాంగ్రెస్ ఖాతాలపైనా కీలకవ్యాఖ్యలు!!
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మనీలాండరింగ్ కు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్, తర్వాత పరిణామాలపై అమెరికా విదేశాంగ శాఖ దౌత్యవేత్త వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై యుఎస్ దౌత్య వేతకు సమన్లు ఇచ్చి, ఆయనను పిలిపించి మాట్లాడిన తర్వాత కూడా మళ్లీ కేజ్రీవాల్ అరెస్టుపై యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నిన్నటికి నిన్న యూఎస్ఏ దౌత్యవేత్త గ్లోరియా బెర్బెనా తాము ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. ఈ కేసులో పారదర్శక విచారణను ప్రోత్సహిస్తున్నాము అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు. ఈ కేసులో సమయానుకూల పారదర్శక న్యాయ ప్రక్రియ జరుగుతుందని ఆశిస్తున్నామని ఆయన వెల్లడించారు.

అయితే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై వ్యాఖ్యలు చేసిన యూఎస్ దౌత్యవేత్తకు భారతదేశం సమన్లు పంపింది. నిన్న అమెరికా తాత్కాలిక డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ గ్లోరియా బెర్బెనాను భారత విదేశీ వ్యవహారాల కార్యాలయానికి పిలిపించుకుని సుమారు 45 నిమిషాల పాటు చర్చించింది.
అయినప్పటికీ ఆ తర్వాత కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో సహా ఈ చర్యలను మేము నిశితంగా అనుసరిస్తూనే ఉన్నామని, తాము ఇది కొనసాగిస్తామని యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ భారతదేశం న్యూ ఢిల్లీలోని యుఎస్ యాక్టింగ్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ గ్లోరియా బెర్బెనాను భారత విదేశీ వ్యవహారాల కార్యాలయానికి పిలిపించడంపై ప్రశ్నలకు సమాధానమిస్తూ కీలకవ్యాఖ్యలు చేశారు.
ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం పై అడిగిన ప్రశ్నలకు కూడా మిల్లర్ సమాధానం చెప్పారు. పన్ను అధికారులు తమ బ్యాంకు ఖాతాలను కొన్నింటిని స్తంభింపజేశారని కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణల గురించి మాకు తెలుసు అని పేర్కొన్న ఆయన ఈ ప్రతి సమస్యకు న్యాయమైన, పారదర్శకమైన మరియు సమయానుకూల చట్టపరమైన ప్రక్రియలను" అమెరికా ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications