
Hair Dye Side Effects: జుట్టుకు రంగు వేస్తున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..
ప్రస్తుత జీవన విధానంతో చాలా మందికి చిన్న వయస్సులోనే తెల్ల వెంట్రుకాలు వస్తున్నాయి. పిల్లలకు కూడా తెల్ల వెంట్రుకాలు వస్తున్నాయి. గతంలో వృద్ధప్యంలో మాత్రమే తెల్ల వెంట్రుకాలు వచ్చేవి. కానీ ఇప్పుడు దాదాపు 10 మందిలో 6గురికి తెల్ల వెంట్రుకాలు వస్తున్నాయి. దీంతో వారు వెంట్రుకాలకం రంగు వేస్తున్నారు. జుట్టుకే కాదు.. కొందరు మీసాలకు కూడా రంగులు వేస్తున్నారు.అయితే ఇది అనేక రకాల దుష్ప్రభావాలను కలిగిస్తుందని మీకు తెలుసా..? సాధారణంగా జుట్టుకు రంగు వేసిన వెంటనే సైడ్ ఎఫెక్ట్స్ తరచుగా కనిపిస్తాయట. వీటిని ముందే పసిగట్టకపోతే తీవ్రంగా మారే అవకాశం ఉందని పలువురు నిపుణులు చెబుతున్నారు.
అలాగే కొందరు తల వెంట్రుకలు చిక్కులు పడకుండా స్ట్రెయిట్‌గా ఉండాలని, నిగనిగలాడాలని మహిళలు అనేక రకాల రసాయన ఉత్పత్తులను వాడుతున్నారు. అయితే, ఇలాంటి హెయిర్ స్ట్రెయిట్‌నర్ కెమికల్స్‌తో మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ ముప్పు పొంచి ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రసాయనాలు ఎప్పుడూ వాడని మహిళలతో పోల్చితే వాడే మహిళలకు ఎక్కువగా గర్భాశయ క్యాన్సర్ వస్తున్నట్టు అధ్యయనంలో తేలింది.

హెయిర్ డై కొన్నిసార్లు చర్మ ప్రతిచర్యకు కారణమవుతుందట. మంట, ఎరుపు బారడం, పొరలుగా చర్మం ఊడిపోవడం, దురద, అసౌకర్యం లాంటి కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయట. జుట్టు రంగులో ఉన్న రసాయనాల కారణంగా ఇది మరింత ప్రాసెస్ చేయబడుతుందట. ఇలాంటి పరిస్థితిలో రసాయనాలు మీ జుట్టు నుంచి తేమను దూరం చేస్తాయట. దీని కారణంగా జుట్టు నుంచి తేమ అదృశ్యమై మెరుపును కోల్పోయే అవకాశం ఉందట. హెయిర్ డై వేసుకునే వారు చర్మ అలెర్జీలు, ఆస్తమాకు ఎక్కువగా గురవుతారని అనేక అధ్యయనాలు నిరూపించాయి.జుట్టుకు రంగు వేయడం వల్ల అలెర్జీ వచ్చిన వ్యక్తులు తలపై ఎర్రటి దద్దుర్లు ఉన్నట్లు ఫిర్యాదులు అందుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. దద్దుర్లు రంగు వేసిన ప్రాంతంలో.. లేదా రంగు ఉన్న ప్రాంతాల్లో కనిపిస్తాయి.