• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Uthra Murder case: యూట్యూబ్ చూసి భార్య హత్యకు ప్లాన్: పాములతో కాటు: భర్తకు శిక్ష ఖరారు

|

తిరువనంతపురం: పాముకాటుతో ఓ మహిళ మరణించగా.. పోలీసులు ఆమె భర్తను అరెస్టు చేసిన ఉదంతం ఇది. భార్యను చంపడానికి అతను రెండుసార్లు ఆమెపై పాములను వదిలాడు. రెండుసార్లూ ఆమె పాముకాటుకు గురయ్యారు. మొదటిసారి ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నా..రెండోసారి బలి అయ్యారు. పాముకాటుతో మరణంచారు. భార్య పుట్టింటి నుంచి తీసుకొచ్చిన ఆభరణాలు, ఆమె పేరు మీద బ్యాంకు డిపాజిట్లను సొంతం చేసుకోవడానికే అతను ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.

 బ్యాంకుల్లో నగదు డిపాజిట్ల కోసం

బ్యాంకుల్లో నగదు డిపాజిట్ల కోసం

అతనితో పాటు సహకరించిన మరో ఇద్దర్ని అరెస్టు చేశారు. కేరళలోని కొల్లం జిల్లాలో చోటు చేసుకున్న ఘటన ఇది. మృతురాలి పేరు ఉత్రా. కొల్లం జిల్లాలోని ఆంచల్ గ్రామానికి చెందిన ఆమెకు పత్తినంథిట్ట జిల్లా ఆడూర్‌కు చెందిన సూరజ్‌తో వివాహమైంది. సూరజ్ తిరువనంతపురంలోని ఓ ప్రైవేటు బ్యాంకులో ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నాడు. పెళ్లి సమయంలో ఉత్రా తల్లిదండ్రులు భారీగా కట్నం ఇచ్చారు. ఆమె పేరు మీద బ్యాంకుల్లో నగదును డిపాజిట్ చేశారు. సూరజ్ చేతికి కట్నం డబ్బులు ఇవ్వలేదు. మొత్తం తమ కుమార్తె పేరు మీదే బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. ఇది అతనికి నచ్చలేదు. అదనపు కట్నం కోసం తరచూ భార్యతో గొడవ పడేవాడు.

 పాముకాటుతో చనిపోయేలా ప్లాన్..

పాముకాటుతో చనిపోయేలా ప్లాన్..

ఉత్ర మరణిస్తే.. ఆమె పేరు మీద ఉన్న బ్యాంకు డిపాజిట్లు తనకు దక్కుతాయని భావించాడు. దీనికోసం స్కెచ్ వేశాడు. పాములతో కాటు వేయించి, హత్య చేయాలని ప్రయత్నించాడు. అలా చేయడం వల్ల దాన్ని యాక్సిడెంట్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చనేది అతని ప్లాన్. దీనికి అనుగుణంగా అతను 10 రూపాయలు ఖర్చు పెట్టి రెండు పామును కొనుగోలు చేశాడు. తిరువనంతపురంలో ఉన్న భార్యను ఆడూర్‌లోని సొంతింటికి తీసుకెళ్లాడు. మార్చి 22వ తేదీన ఆమె పాముకాటుకు గురయ్యారు. ఆమెను రక్షించినట్లు నటించాడు. ఆసుపత్రికి తరలించాడు. ఆమె కోలుకున్నారు. అనంతరం భార్యను కొల్లం జిల్లాలోని ఆంచల్ గ్రామానికి తీసుకెళ్లాడు.

రెండుసార్లు పాములతో కాటు

రెండుసార్లు పాములతో కాటు

తనకు పాములను సరఫరా చేసిన వ్యక్తిని అక్కడికి పిలిపించుకున్నాడు. ఈ నెల 6వ తేదీన పుట్టింట్లో ఆమె నిద్రిస్తుండగా.. పామును విడిచి పెట్టాడు. రెండోసారి పాముకాటుకు గురైన ఆమె మరణించారు. రెండుసార్లు పాముకాటుకు గురి కావడం పట్ల ఉత్ర కుటుంబీకుల్లో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ నెల 7వ తేదీన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రెండుసార్లు ఉత్ర పాముకాటుకు గురికావడానికి భర్తే కారణమని నిర్ధారించారు. సూరజ్ సహా పాములను విక్రయించిన వ్యక్తితో పాటు ఉత్రను హత్య చేయడానికి సహకరించిన మరొకరిని అరెస్టు చేశారు.

యూట్యూబ్ ద్వారా ప్రయత్నం..

యూట్యూబ్ ద్వారా ప్రయత్నం..

నిందితులపై హత్య, హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినట్లు కొల్లం రూరల్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ కేఎస్ హరిశంకర్ తెలిపారు. పాములతో ఎలా కాటు వేయించాలనే విషయంపై సూరజ్ మూడు నెలల పాటు యూట్యూబ్ ద్వారా.. వాటికి సంబంధించిన వీడియోలను క్రమం తప్పకుండా చూసేవాడని తమ దర్యాప్తులో తేలినట్లు చెప్పారు. రెండోసారి పాముకాటుకు గురైనప్పుడు ఉత్ర స్పృహ కోల్పోయారని, ఆమెను ఆసుపత్రికి తరలిచడంలో ఉద్దేశపూరకంగా జాప్యం చేశాడని అన్నారు. ఇక్కడే అతను అనుమానస్పదంగా వ్యవహరించినట్లు మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారని, ఆ కోణంలో తాము దర్యాప్తు చేశామని అన్నారు. వెయ్యి పేజీల ఛార్జిషీట్‌ను దాఖలు చేశారు.

 ఈ కేసులో భర్తకు శిక్ష ఖరారు..

ఈ కేసులో భర్తకు శిక్ష ఖరారు..

ఈ కేసులో భర్త సూరజ్‌కు శిక్ష ఖరారైంది. కొల్లం అదనపు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ న్యాయస్థానం అతనికి యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. అయిదు లక్షల రూపాయల జరిమానా విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మనోజ్ ఎం తీర్పు ఇచ్చారు. నిందితుడికి మరణశిక్ష విధించాలంటూ న్యాయవాది జీ మోహన్ రాజ్ విజ్ఞప్తి చేశారు. ఈ కేసుకు ఉన్న తీవ్రతను దృష్టిలో ఉంచుకుని డెత్ సెంటెన్స్ ఇవ్వాలని కోరారు. మరోసారి ఇలాంటి చర్యలకు దిగడానికి భయం కలిగే శిక్ష ఉండాలని అన్నారు.

English summary
In the Uthra murder case, a Kerala court on Wednesday sentenced Sooraj S Kumar to life imprisonment and a five lakh fine for murdering his wife by inducing a homicidal snakebite.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X