షాక్: బంధించి రేప్, ఆశ్రమంలో గురువులపై నలుగురు సాధ్వీల ఫిర్యాదు
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బస్తీ జిల్లా కేంద్రంలోని ఆశ్రమంలో ప్రధాన గురువు అతని ఇద్దరు అనుచరులు అత్యాచారానికి పాల్పడ్డారని నలుగురు మహిళా భక్తులు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు పరారీలో ఉన్నారు.
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బస్తీలో ఉన్న ఆశ్రమంలో మహిళా సాధ్వీలపై ప్రధాన గురువు లైంగిక దాడికి పాల్పడినట్టు బాధితులు ఆరోపించారు. చాలా కాలం నుండి తమపై లైంగిక దాడులకు పాల్పడుతున్నట్టు బాధితులు ఆరోపించారు.నిందితులు పారిపోయారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

బస్తీ ఆశ్రమంలో గురువుపై లైంగిక వేధింపుల ఆరోపణలు
బస్తీ ఆశ్రమంలో గురువుపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని అదే ఆశ్రమంలో ఉంటున్న సాధ్వీలు ఆరోపణలు గుప్పించారు. ఓ ఆశ్రమానికి చెందిన బాబా, అతని అనుచరులు తమపై వరుసగా అత్యాచారం జరుపుతూ.. చిత్రహింసలకు గురిచేశారని నలుగురు మహిళా భక్తులు ఆరోపించారు. మంగళవారం ఇద్దరు సాధ్వీలు ఆరోపించగా.. తాజాగా బుధవారం మరో ఇద్దరు సాధ్వీలు పోలీసులను ఆశ్రయించారు.

బంధించి అత్యాచారం
ఆశ్రమంలోని ప్రధాన గురువుతో పాటు అతని అనుచరులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే తాము సహకరించకపోవడంతో
ఆశ్రమంలో బంధించి అత్యాచారం జరిపారని పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు.బాధితులకు వైద్యపరీక్షలకు పంపినట్టు పోలీసులు తెలిపారు.

ముగ్గురు బాబాలు అత్యాచారం చేశారు
2008 నుంచి తాము ఆశ్రమంలో నివసిస్తున్నామని సాధ్వీలు తెలిపారు. 'నేను ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చాను. 12 ఏళ్ల వయస్సులో 2008లో నేను ఇక్కడికి వచ్చాను. అమాయకురాలిని కావడంతో నాపట్ల ఏం జరిగిదో తెలిసేది కాదు. నేను నిరాకరించినా ఇక్కడి ముగ్గురు బాబాలు నాపై అత్యాచారం జరిపారు. నన్ను బందీగా ఉంచి.. కొడుతూ,, తరచూ అత్యాచారం జరిపారు' అని ఓ సాధ్వీ తెలిపారు.

పారిపోయిన నిందితులు
అయితే అత్యాచారం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు ఆశ్రమం నుండి పారిపోయారు. నిందితుల కోసం గాలింపు చర్యలను చేపట్టినట్టు బస్తీ జిల్లా ఎస్పీ సంకల్ప్ శర్మ తెలిపారు. అయితే ఈ నిందితులు పట్టుబడితే మరిన్ని విషయాలు తెలిసే అవకాశాలున్నాయని పోలీసులు తెలిపారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications