వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్కడా 'బీజేపీ' రాజకీయం!: బీహార్ తరహా షాకివ్వనున్న అఖిలేష్

ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానిగా పగ్గాలు చేపట్టాక అన్ని రాష్ట్రాల్లో కమలం పార్టీని బలోపేతం చేసే ప్రక్రియ మరింత ఎక్కువగా కొనసాగుతోంది. అసోం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాలలో బీజేపీ పావులు క

|
Google Oneindia TeluguNews

లక్నో: ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానిగా పగ్గాలు చేపట్టాక అన్ని రాష్ట్రాల్లో కమలం పార్టీని బలోపేతం చేసే ప్రక్రియ మరింత ఎక్కువగా కొనసాగుతోంది. అసోం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాలలో బీజేపీ పావులు కదిపింది.

యూపీ బీజేపీకి కీలకం: ఎన్నో కారణాలు, సీఎం రేసులో వీరే..యూపీ బీజేపీకి కీలకం: ఎన్నో కారణాలు, సీఎం రేసులో వీరే..

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలకు ధీటుగా ఎదిగే ప్రయత్నాలు చేస్తోంది. తమిళనాడులో జయలలిత మృతి అనంతరం ఏర్పడిన శూన్యతను తనకు అనుకూలంగా ఉపయోగించుకునే ప్రయత్నాలు చేసింది. పన్నీరు సెల్వంను పావుగా వాడుకునే ప్రయత్నాలు చేసినా, శశికళ వ్యూహాల ముందు చిత్తయ్యాయి.

ఇప్పుడు, తమకు బాగా బలం ఉన్న ఉత్తర ప్రదేశ్‌లోను బీజేపీ పావులు కదుపుతోందా.. అంటే ఇటు ములాయం వర్గం, అటు అఖిలేష్ వర్గం అవుననే అంటోంది. ములాయం వర్గం వెనుక బీజేపీ ఉందని అఖిలేష్ వర్గం అంటే, కొడుకు వర్గం వెనుకే కమలం ఉందని తండ్రి వర్గం భావిస్తోంది.

ములాయంకు భంగపాటు: కొడుక్కి 'ఈసీ' బూస్ట్.. అఖిలేష్‌కే 'సైకిల్ములాయంకు భంగపాటు: కొడుక్కి 'ఈసీ' బూస్ట్.. అఖిలేష్‌కే 'సైకిల్

యూపీలో బీజేపీకి బలం ఉంది. కానీ గత పదిహేనేళ్లుగా అధికారానికి దూరంగా ఉంది. గత సార్వత్రిక ఎన్నికల్లో 80 లోకసభ స్థానాలకు 73 స్థానాలు గెలుచుకుంది. ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని కష్టపడుతోంది.

ఎస్పీలో రగడ

ఎస్పీలో రగడ

ఎస్పీలో కుటుంబ రగడ కొనసాగుతోంది. అఖిలేష్ యాదవ్ వర్గంలో ములాయం సోదరుడు రాం గోపాల్ యాదవ్ ఉన్నారు. ములాయం వర్గంలో మరో సోదరుడు శివపాల్ యాదవ్, రెండో కోడలు అపర్ణ ఉన్నారు. అపర్ణకు ములాయంతో పాటు మోడీ లేదా బీజేపీ అంటే అభిమానం. దీంతో ములాయం వర్గం వెనుక.. పరోక్షంగా బీజేపీ ఉందని అఖిలేష్ వర్గం భావిస్తోంది.

బీజేపీకి అఖిలేష్‌కు లింక్ పెట్టిన ములాయం

బీజేపీకి అఖిలేష్‌కు లింక్ పెట్టిన ములాయం

బీజేపీ సూచనల మేరకు పనిచేసే రాంగోపాల్‌ యాదవ్‌ చేతుల్లో అఖిలేశ్‌ కీలుబొమ్మగా మారారని ములాయం విమర్శిస్తున్నారు. కొడుకే వ్యతిరేకంగా మారిన పరిస్థితుల్లో తానేం చేయగలనని ములాయం సూటిగా ప్రశ్నించారు. ఇలా జరుగుతుందని తానెన్నడూ ఊహించలేదన్నారు. పార్టీని నిర్మించడానికి తాను అనేక త్యాగాలు చేస్తే అఖిలేశ్‌ మాత్రం సహేతుక కారణాలు లేకుండానే ఒక మహిళ సహా అనేకమంది మంత్రుల్ని తొలగించారన్నారు. పార్టీలో చీలికను నివారించడంలో తాను నిస్సహాయుడినయ్యానన్నారు.

స్వాగతించిన కాంగ్రెస్‌

స్వాగతించిన కాంగ్రెస్‌

ఇదిలా ఉండగా, అఖిలేష్ వర్గానికి సైకిల్ గుర్తు కేటాయింపు నిర్ణయాన్ని కాంగ్రెస్‌ పార్టీ స్వాగతించింది. అఖిలేశ్‌ను అభినందనలు తెలిపింది. సమాజ్‌వాదీ పార్టీలో 90% మంది ఆయనవైపే ఉన్నారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి ఆర్‌పిఎన్‌ సింగ్‌ చెప్పారు.

బీజేపీకి వ్యతిరేకంగా అఖిలేష్ కూటమి

బీజేపీకి వ్యతిరేకంగా అఖిలేష్ కూటమి

ఇదిలా ఉండగా బీహార్ ఎన్నికల్లో వలె యూపీలోని బీజేపీని మహా లౌకిక కూటమి తెరపైకి వస్తోంది. అఖిలేశ్‌ వర్గంతో జతకట్టి మహా లౌకిక కూటమిని ఏర్పాటు చేయడం ద్వారా బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ప్రయత్నాలు వూపందుకున్నాయి. 403 స్థానాల్లో కాంగ్రెస్‌కి 90 నుంచి 100 కేటాయించవచ్చని తెలుస్తోంది. అజిత్‌సింగ్‌ నేతృత్వంలోని ఆర్‌ఎల్డీ పార్టీతోనూ పొత్తు ఉంటుంది.

English summary
Akhilesh-led SP, Congress, RLD may form Bihar-style grand alliance in Uttar Pradesh Assembly Election 2017.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X