Uttar Pradesh polls: రేపే రెండో దశ పోలింగ్, 55 స్థానాలకు ఎన్నికలు, పోటీలో ముఖ్యులు వీరే

లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రోహిల్‌ఖండ్ ప్రాంతంలోని కొన్ని సహా తొమ్మిది జిల్లాల్లోని 55 స్థానాలకు సోమవారం ఉత్తరప్రదేశ్‌లో రెండవ దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది, ఇందులో సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు మహ్మద్ ఆజం ఖాన్, రాష్ట్ర ఆర్థిక మంత్రి సురేష్ ఖన్నా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

సహరాన్‌పూర్, బిజ్నోర్, మొరాదాబాద్, సంభాల్, రాంపూర్, అమ్రోహా, బుదౌన్, బరేలీ, షాజహాన్‌పూర్‌లలో విస్తరించి ఉన్న స్థానాలతో ఈ దశలో 586 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని లక్నోలోని ఎన్నికల కార్యాలయం తెలిపింది.

ఈ దశలో ఎన్నికలు జరగనున్న 55 స్థానాల్లో 2017లో బీజేపీ 38 స్థానాల్లో గెలుపొందగా, సమాజ్‌వాదీ పార్టీ 15, కాంగ్రెస్‌ రెండు స్థానాల్లో విజయం సాధించాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని పోటీ చేశాయి. ఎస్పీ గెలుచుకున్న 15 స్థానాల్లో ముస్లిం అభ్యర్థులు 10 స్థానాల్లో విజయం సాధించారు.

 Uttar Pradesh Assembly polls: second phase on Monday, 586 candidates in fray

ఈ దశలో ఎన్నికలకు వెళ్లే ప్రాంతాలలో బరేల్వి, దేవ్‌బంద్ వర్గాలకు చెందిన మత పెద్దల ప్రభావంతో గణనీయమైన ముస్లిం జనాభా ఉంది. ఈ ప్రాంతాలు సమాజ్ వాదీ పార్టీకి కంచుకోటలుగా పరిగణించబడుతున్నాయి. ఎన్నికల తర్వాత ఎస్పీకి మారిన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ మంత్రి ధరమ్ సింగ్ సైనీ ఈ దశలో పోటీలో ఉన్న ప్రముఖుల జాబితాలో ఉన్నారు.

ఆజంఖాన్ తన బలమైన స్థానం రాంపూర్ నుంచి, ఖన్నా షాజహాన్‌పూర్ నుంచి పోటీ చేయగా, సైనీ నకుడ్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

స్వర్ స్థానం నుంచి ఆజంఖాన్ కుమారుడు అబ్దుల్లా ఆజం బరిలోకి దిగారు. బీజేపీ మిత్రపక్షమైన అప్నా దళ్ (సోనేలాల్) టిక్కెట్‌పై తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న రాంపూర్ నవాబ్‌లు, మరొక రాజకీయ కుటుంబ వారసుడు హైదర్ అలీ ఖాన్‌పై ఆయన పోటీ పడుతున్నారు. హైదర్ అలీ ఖాన్ మాజీ ఎంపీ నూర్ బానో మనవడు.

బిలాస్‌పూర్‌ నుంచి జల్‌శక్తి సహాయ మంత్రి బల్‌దేవ్‌ సింగ్‌ ఔలాఖ్‌, బదౌన్‌ నుంచి పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి మహేశ్‌ చంద్ర గుప్తా, చందౌసీ నుంచి సెకండరీ విద్యాశాఖ సహాయ మంత్రి గులాబ్‌ దేవి కూడా ఎన్నికల బరిలో నిలిచారు.

బరేలీ మాజీ మేయర్ సుప్రియా ఆరోన్ సమాజ్ వాదీ పార్టీలో చేరిన తర్వాత బరేలీ కంటోన్మెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీకి ప్రచారం చేస్తూ.. అల్లర్లు లేకుండా ఉంచడానికి రాష్ట్రంలో తన పార్టీ ప్రభుత్వం ఎందుకు అవసరమో వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. అఖిలేష్ పార్టీపై విమర్శల దాడి చేశారు. ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా చట్టం గురించి కూడా ఆయన మాట్లాడారు. బీజేపీకి ఓటేయకపోతే మళ్లీ ఉత్తరప్రదేశ్ గూండాల రాజ్యంగా మారిపోతుందని హెచ్చరించారు.

ఏడు దశల్లో జరగనున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మొదటి దశ ఎన్నికలు ఫిబ్రవరి 10న జరగ్గా.. ఫలితాలు మార్చి 10న వెలువడనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+