Yogi Adityanath : హాకీ ఆడిన యోగీ ఆదిత్యనాథ్-స్పోర్ట్స్ డే సందర్భంగా..
యూపీలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చాక తనదైన శైలిలో అభివృద్ధి పనుల్ని పరుగులు తీయిస్తున్న యోగీ ఆదిత్యనాథ్.. ఇతర అంశాల్లోనూ అంతే చురుగ్గా ఉంటున్నారు. ఇవాళ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఝాన్సీలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో యోగీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హాకీ టర్ఫ్ పై స్టిక్ పట్టుకుని హాకీ కూడా ఆడారు. దీంతో అప్పటివరకూ యోగీని సీఎంగా, సాధువుగామాత్రమే చూసిన వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు.
ఝాన్సీలోని స్టేడియంలో పలు క్రీడా సౌకర్యాలు ప్రారంభించిన యోగీ ఆదిత్యనాథ్.. హాకీ స్టిక్ తీసుకుని బంతిని బలంగా కొట్టారు. అయితే అది హాకీ తరహాలో కాకుండా గోల్ఫ్ తరహాలో యోగీ కొట్టడం విశేషం. దీంతో అక్కడే ఉన్న అధికారులు, క్రీడాకారులు కేరింతలతో ఆయన్ను అభినందించారు. క్రీడాదినోత్సవం సందర్భంగా యోగీ తమ స్టేడియానికి రావడంపై వారు సంతోషం వ్యక్తం చేశారు.

యూపీలోని ఝాన్సీలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రారంభించిన సీఎం యోగీ ఆదిత్యనాథ్.. హాకీ ఈవెంట్ లో కూడా పాల్గొన్నారు. క్రీడలో నిమగ్నమై, విభిన్న ప్రాజెక్టుల ప్రారంభోత్సవాన్ని జరుపుకునే కార్యక్రమంలో ఆదిత్యనాథ్ ఎంజాయ్ చేశారు. ఇలా సీఎం నేరుగా హాకీ ఆటలో పాల్గొనడం ద్వారా అభివృద్ధి, క్రీడల విషయంలో ప్రభుత్వ ఉద్దేశాన్ని తెలియజేశారు.స్ధానికులతో మమేకం అయ్యేందుకు యోగీ చేస్తున్న ప్రయత్నాల్లోనూ ఇది భాగమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
మరోవైపు రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్రంలో మహిళలకు యోగీ ఆదిత్యనాథ్ మరో వరం ప్రకటించారు. ట్విట్టర్ లో చేసిన ఓ పోస్టులో యోగీ.. "సోదర సోదరి ప్రేమకు పవిత్ర చిహ్నమైన రక్షాబంధన్ సందర్భంగా, ఉత్తర ప్రదేశ్‌లో, ఆగస్టు 29న 12:00 గంటల నుండి ఆగస్టు 31 అర్ధరాత్రి 12 గంటల వరకూ రాష్ట్ర ప్రభుత్వ బస్సులలో తల్లులు, సోదరీమణులు, కుమార్తెలందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యాలు అందించబడతాయని తెలిపారు.












Click it and Unblock the Notifications