Yogi Adityanath : సుపరిపాలన కావాలంటే జరగాల్సింది అదే..! యోగీ కీలక వ్యాఖ్యలు..

ఉత్తర్ ప్రదేశ్ లో గుడ్ గవర్నెన్స్ (సుపరిపాలన)తో గతేడాది వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన యోగీ ఆదిత్యనాథ్ దాని వెనుక తాను తీసుకుంటున్న చర్యల్ని తాజాగా వివరించారు. సుపరిపాలన కావాలంటే ముందుగా చట్టబద్ధమైన పాలన అవసరమని యోగీ ఆదిత్యనాథ్ తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు అన్ని వర్గాలకు చేరువయ్యేందుకు తాము తీసుకుంటున్న చర్యల్ని యోగీ వెల్లడించారు.

సుపరిపాలన చేసేందుకు అవసరమైన శాంతిభద్రతల అవసరాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తాజాగా ప్రస్తావించారు. గత ఆరేళ్లలో ఉత్తరప్రదేశ్ పోలీసులు రాష్ట్రంలో నేరాలు, అల్లర్లు, అరాచకాల నుండి బయటపడటం ద్వారా చట్టబద్ధమైన పాలనను స్థాపించారని యోగీ తెలిపారు. గోరఖ్‌నాథ్ పోలీస్ స్టేషన్, ఎయిమ్స్ పోలీస్ స్టేషన్ ల అత్యాధునిక, హైటెక్ పరిపాలనా భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా యోగి ఈ వ్యాఖ్యలుచేశారు.

uttar pradesh

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో అమలవుతున్న నేరాలపై జీరో టాలరెన్స్ పాలసీ, చట్టబద్ధమైన పాలన వల్లే నేడు ఉత్తరప్రదేశ్ అత్యుత్తమ, సురక్షితమైన పెట్టుబడి కేంద్రంగా అవతరించిందని యూపీ సీఎం యోగీ అన్నారు. గోరక్షనాథ్ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి రూ.17.10 కోట్లు, కొత్తగా ఏర్పాటైన ఎయిమ్స్ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి రూ.5.42 కోట్లు యూపీ సర్కార్ ఖర్చు చేసింది. యూపీ తాజాగా రూ.36 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలను ఆకర్షించిందని, ఈ ప్రతిపాదనలు అమలైతే కోటి మంది యువతకు కూడా ఉద్యోగాలు లభిస్తాయని యోగీ పేర్కొన్నారు.

Yogi Adityanath

అన్ని పండుగలు ప్రశాంతంగా జరుపుకునే ఉత్తరప్రదేశ్‌లో ఇవాళ అరాచకాలకు తావులేదని ముఖ్యమంత్రి యోగీ తెలిపారు.బక్రీద్ (ఈద్-ఉల్-అధా), రామనవమి, ఈద్ వేడుకల సందర్భంగా రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుండి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినట్లు ఫిర్యాదులు రాలేదన్నారు. చట్టబద్ధమైన పాలన జీవితంలో మార్పుకు మాధ్యమం అవుతుందని యోగీ తెలిపారు. సామాన్యులకు పెట్టుబడులకు వాతావరణాన్ని పెంపొందిస్తుందని, ప్రజలకు అత్యంత సురక్షితమైన వాతావరణం కల్పిస్తుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+