మోడీ ప్రపంచానికే ట్రబుల్ షూటర్..! యోగీ ఆదిత్యనాథ్ కామెంట్స్..
యూపీలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చాక కేంద్రం సాయంతో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న సీఎం యోగీ ఆదిత్యనాథ్.. ఈ మధ్య వరుసగా ప్రధాని మోడీ జపం కూడా చేస్తున్నారు. ముఖ్యంగా యూపీ అభివృద్ధితో పాటు దేశాభివృద్ధిలోనూ మోడీ పాత్రపై యోగీ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదే క్రమంలో మోడీని ప్రపంచ సమస్యల పరిష్కార కర్తగానూ యోగీ అభివర్ణిస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని తొమ్మిదేళ్ల బీజేపీ ప్రభుత్వం దేశ పురోగతి, శ్రేయస్సు కోసం కొత్త ప్రమాణాలు నెలకొల్పిందని యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ వెల్లడించారు. ప్రస్తుతం అతిపెద్ద సంక్షోభాలను పరిష్కరించడంలో దేశ సామర్థ్యాన్ని ప్రపంచం మొత్తం గుర్తిస్తోందన్నారు. గ్లోబల్ ఫోరమ్‌లలో భారతదేశం, దాని ప్రజల ప్రతిష్ట పెరగడమే కాకుండా, భారతదేశం పట్ల ప్రపంచ ప్రజల దృక్పథం కూడా మారిపోయిందని యోగీ గుర్తుచేశారు. ఈ రోజు ప్రపంచం మొత్తం ప్రధాని నరేంద్ర మోడీని ట్రబుల్ షూటర్ గా చూస్తోందన్నారు.

ప్రధాని మోదీ నాయకత్వంలో కొత్త భారతదేశం ఆవిర్భవించిందని సీఎం యోగీ ఆదిత్యనాథ్ తెలిపారు. ప్రధాని మోడీ సందర్శించే అన్ని దేశాల ప్రజలలో కొత్త ఉత్సాహం కనిపిస్తుందన్నారు. కరోనా సంక్షోభ సమయంలో భావ ప్రకటనా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలను సమర్థిస్తూ దేశానికి అందించిన నాయకత్వానికి ప్రధాని మోడీని అభినందించడానికి ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఉందన్నారు. మోడీ దేశంలోని పౌరులందరికీ ఉచిత పరీక్షలు, చికిత్స, వ్యాక్సిన్‌లను అందించారన్నారు. 220 కోట్ల డోస్‌ల వ్యాక్సిన్‌తో పాటు అవసరమైన వారికి సాయం కూడా అందించారన్నారు.

గతంలో భారతదేశానికి చేతకాదని ప్రపంచ ప్రజలు అనుకునే వారని, ఇప్పుడు భారత్ ఒక్కటే చేయగలదని భావిస్తున్నారని యోగీ ఆదిత్యనాథ్ తెలిపారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి నుండి అంతర్గత మరియు బాహ్య భద్రత వరకు, పేద సంక్షేమ పథకాల ద్వారా, ప్రధాని నరేంద్ర మోడీ దేశ పౌరుల జీవితాల్లో భారీ మార్పులను తీసుకువచ్చారని యోగీ తెలిపారు.












Click it and Unblock the Notifications