రూ.550 కోట్లతో నిర్మితమైన స్టీల్‌ప్లాంట్‌‌ను ప్రారంభించనున్న సీఎం

రూ.550 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌ను గోరఖ్‌పూర్‌లో సీఎం యోగీ ప్రారంభిస్తారు

లక్నో: ఉత్తర్ ప్రదేశ్‌లో అభివృద్ధి శరవేగంగా దూసుకెళుతోంది. 2023-24 బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత యోగీ సర్కార్ డెవలప్‌మెంట్‌పై ఫోకస్ చేసింది.ఇప్పటికే ఆ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రాగా... తాజాగా మరో కొత్త ప్రాజెక్టును సీఎం యోగీ ఆదివారం ప్రారంభించనున్నారు. రూ.550 కోట్లతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌ను గోరఖ్‌పూర్‌లో సీఎం యోగీ ప్రారంభిస్తారు. ఇది గోరఖ్‌పూర్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటి (GIDA)లో ఏర్పాటు చేశారు.

మొత్తం 82 ఎకరాల విస్తీర్ణంలో అంకుర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్టీల్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ స్టీల్‌ప్లాంట్‌లో పనులు నడుస్తున్నాయి. ఇందులో థర్మాక్స్ పవర్‌తో కూడిన మెటల్ రాడ్స్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. అయితే ఈ ప్లాంట్ విస్తరణ కోసం అంకుర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యోగీ సర్కార్‌తో రూ.700 కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది.

Uttar Pradesh:CM Yogi to inaugurate rs.550 cr integrated steel plant,details here

ఇదిలా ఉంటే ఈ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా 2000 మందికి, పరోక్షంగా 5వేల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు స్టీల్ ప్లాంట్ అధికారి వెల్లడించారు. ప్రస్తుతం ఏడాదికి 3 లక్షల టన్నుల మేరా ఉత్పత్తి సామర్థ్యం ఉందని చెప్పారు. 2020లో ప్లాంట్‌లో పనులు ప్రారంభంకాగా స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ పాలసీ 2020 కింద ఈ ప్రాజెక్ట్‌ను మెగా ప్లస్ ప్రాజెక్ట్‌ కేటగిరీ కిందకు చేర్చినట్లు తెలిపారు. అంకుర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్‌గా 1.5 కిలోమీటర్ మేరా రైల్వే ట్రాక్ నిర్మించింది. సరుకును అన్‌లోడ్‌ చేసేందుకు 700 మీటర్ల మేరా ప్లాట్‌ఫారం‌ను కూడా నిర్మించింది.

Uttar Pradesh:CM Yogi to inaugurate rs.550 cr integrated steel plant,details here

30 మెగా వాట్ల సామర్థ్యంతో ఈ ప్లాంట్ నిర్మాణం జరిగిందని అంకుర్ ఇండస్ట్రీస్ ఎండీ అశోక్ జలాన్‌ వెల్లడించారు.ఇక విద్యుత్‌ ఉత్పత్తి కోసం 65శాతం వ్యర్థ ముడిసరుకు వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా ఉందని గిడా సీఈఓ పవన్ అగర్వాల్ చెప్పారు. ఈ క్రమంలోనే పెట్టుబడిదారులకు ప్రోత్సాహాన్ని ఇస్తుండటంతో వారు కూడా ఎంతో ఆసక్తితో పెట్టుబడులు పెట్టేందుకు తరలి వస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం గాలంట్ గ్రూప్ తమ సిమెంట్ ఫ్యాక్టరీని గిడాలో నిర్వహిస్తోందని గుర్తు చేశారు. ఇక ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగిన ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో పలు ఒప్పందాలు జరిగాయని ఇవన్నీ కూడా గిడా కింద ఏర్పాటు అవుతాయని గిడా సీఈఓ పవన్ అగర్వాల్ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+