వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌తో పొత్తు ఖాయమే: యూపీలో స్టార్ డింపుల్

యుపిలో కాంగ్రెసు, అఖిలేష్ ఎస్పీకి మధ్య పొత్తు దాదాపుగా ఖాయమైనట్లే.. ప్రియాంక గాంధీతో డింపుల్ జరిపిన చర్చలు కొలిక్కి వచ్చినట్లు భావిస్తున్నారు.

By Pratap
|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సిఎం అఖిలేశ్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ క్రియాశీల పాత్ర పోషించనున్నారా? కుటుంబంలోని ఇతర పెద్దల కంటే ప్రముఖ పాత్ర పోషిస్తారా? అంటే అవుననే చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. కాంగ్రెస్ పార్టీకి, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అఖిలేశ్ గ్రూప్ మధ్య పొత్తు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

అలహాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఇర్షాద్ ఉల్లా, మరో నేత అనిల్ చౌదరిల ఫొటోలు ఈ హోర్డింగ్‌ల్లో చోటు చేసుకున్నాయి. మహిళతోపాటు రాష్ట్రంలోని ముస్లింల ఓటింగ్ చీలకుండా.. బిజెపిని అధికారానికి దూరంగా ఉంచవచ్చునని కాంగ్రెస్, ఎస్పీ భావిస్తున్నాయి.

కన్నౌజ్ నుంచి రెండోసారి లోక్ సభకు ఎన్నికైన డింపుల్ ఇప్పటివరకు భర్త చాటు భార్యగానే ఉన్నారు. కానీ పార్టీలో నేతాజీ, యువనేత మధ్య ఆధిపత్య పోరు నేపథ్యంలో తన భర్త అఖిలేశ్ యాదవ్‌కు ఆమె పూర్తిగా బాసటగా నిలువడమే కాదు.. కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఖరారులోనూ కీలకంగా వ్యవహరించారు.

 ప్రియాంక, డింపుల్‌తో సాధ్యమే...

ప్రియాంక, డింపుల్‌తో సాధ్యమే...

డింపుల్ వ్యూహానికి అనుగుణంగానే అలహాబాద్, తదితర ప్రాంతాల్లో డింపుల్ యాదవ్, ప్రియాంక గాంధీ ఫొటోలతో హోర్డింగ్‌లు దర్శనమిచ్చాయి. ఎన్నికల సంఘం ‘సైకిల్' గుర్తుపై తుది నిర్ణయం తీసుకోకపోయినా రెండు పార్టీల మధ్య పొత్తు ఖాయమని తెలుస్తున్నది. ‘డింపుల్, ప్రియాంక కలిస్తే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళా సాధికారత సాధ్యమే' అనే నినాదం సదరు హోర్డింగ్‌లపై దర్శనమిచ్చింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, ఉత్తరప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాజ్ బబ్బర్, దళిత నాయకుడు పిఎల్ పూనియా వంటి వారు ఎస్పీ పార్టీతో పొత్తును వ్యతిరేకిస్తున్నారు. అఖిలేశ్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పార్టీకి నష్టం చేకూరుస్తుందని వారి ఆందోళన.

 ప్రియాంకతో డింపుల్ చర్చలు

ప్రియాంకతో డింపుల్ చర్చలు

కాంగ్రెస్ పార్టీతోపాటు అఖిలేశ్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీకి కూడా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కీలకమే. పార్టీ అంతర్గత ఆధిపత్య పోరు వ్యూహరచనలో నిమగ్నమై ఉన్న అఖిలేశ్‌కు దన్నుగా ఆయన తరుఫున ఆమె రాయబారం నెరిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తనయ ప్రియాంక గాంధీతో సంప్రదించారు. హస్తం పార్టీతో పొత్తుకు సుముఖంగా ఉన్నామన్న సంగతి ప్రియాంక చెవిన బడేశారు. 27 ఏళ్లుగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరంగా ఉన్నది. (

 కాంగ్రెసుకు వందకుపైగా..

కాంగ్రెసుకు వందకుపైగా..

మొత్తం 403 స్థానాలకు కాంగ్రెస్‌కు 100కు పైగా సీట్లు ఇచ్చేందుకు అఖిలేష్ వర్గం సుముఖంగా ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కనుక ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అఖిలేష్ వర్గంతో కాంగ్రెస్ పొత్తు దాదాపు ఖరారైనట్టే. అధికారికంగానే పొత్తుల అంశాన్ని ప్రకటించాల్సి ఉంది. బహిరంగంగానే కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు తాము సుముఖమేనని అఖిలేశ్ చెప్పారు. తనకు గల పాజిటివ్ ఇమేజ్‌కు తోడు 2019 నాటికి బిజెపిని దెబ్బతీయాలని తలపోస్తున్న కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడం కలిసి వస్తుందని విశ్వాసంతో ఉన్నారు.కాంగ్రెస్ పార్టీతో పొత్తుతో 300కి పైగా సీట్లు గెలుచుకోగలమని నమ్ముంతో అఖిలేశ్ ఉన్నారు. కానీ సమాజ్‌వాదీ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని, ఏ పార్టీతోనూ ఎన్నికల ముందు పొత్తు ఉండదని ములాయం సింగ్ యాదవ్ తెగేసి చెప్పారు.

 పతాక స్థాయికి విభేదాలు...

పతాక స్థాయికి విభేదాలు...

అటు ములాయం వర్గం, ఇటు అఖిలేశ్ వర్గంగా విడిపోవడం, 'సైకిల్' గుర్తు కోసం ఇరువర్గాలు ఈసీని ఆశ్రయించడంతో ఆ పార్టీలో తలెత్తిన సంక్షోభం పతాక స్థాయికి చేరింది. ఇదే తరుణంలో అఖిలేష్ వర్గంతో పొత్తుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వచ్చింది. కాగా, శుక్రవారంనాడు 'సైకిల్' గుర్తుపై ములాయం, అఖిలేష్ వర్గాల వాదనలు విన్న ఎన్నికల సంఘం తమ నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. ఈసీ నిర్ణయం వెలువడగానే అఖిలేశ్ సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌ మధ్య పొత్తు ప్రకటన వెలువడుతుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.

 బిజెపి వ్యతిరేక ఓటు కోసం...

బిజెపి వ్యతిరేక ఓటు కోసం...

బిజెపికి వ్యతిరేకంగా ఉన్న ముస్లింల ఓటింగ్ చీలకుండా లౌకిక వాదులు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో 20 శాతం మంది ఓటర్లు ముస్లింలే. ములాయం, అఖిలేశ్ మధ్య చీలిక వల్ల ముస్లింల ఓటు చీలకుండా ఉండేందుకే కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు అఖిలేశ్ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఓటు బ్యాంక్ షేరింగ్ వల్ల భవిష్యత్ లో పార్టీ బలహీన పడుతుందని ఎస్పీ పహిల్వాన్ ములాయం, బిఎస్పీ అధినేత మాయావతి ప్రగాడ విశ్వాసం. 1995లో బిజెపి బయట నుంచి మద్దతునిస్తుండగా మాయావతితో సిఎంగా అప్పటి గవర్నర్ మోతీలాల్ ఓరా ప్రమాణ స్వీకారంచేయించినప్పుడు ములాయం చేసిన వ్యాఖ్య ఇప్పటికి ప్రతిబింబిస్తూనే ఉన్నది. మాయావతికి అనుకూలంగా వ్యవహరించి కాంగ్రెస్ పార్టీ చారిత్రక తప్పిదానికి పాల్పడిందని, ఆ పార్టీ దళితుల ఓట్లను కోల్పోతుందని వ్యాఖ్యానించారు కూడా.

 విఫలమైన అమర్ సింగ్ రాయబారం

విఫలమైన అమర్ సింగ్ రాయబారం

ప్రస్తుతం ఎన్నికల ముందు ఏ పార్టీతో పొత్తు కుదరదని స్వయంగా ప్రకటించిన ములాయం సింగ్ యాదవ్, తన సన్నిహితుడు అమర్ సింగ్ ద్వారా 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు రాయబారం నడిపారు. అయితే దేశమంతా పొత్తు పెట్టుకుని బలాన్ని పెంచుకోవాలని ఉవ్విళ్లూరిన ములాయం సింగ్ యాదవ్‌తో పొత్తుకు కాంగ్రెస్ పార్టీ నిరాకరించింది. లోక్ సభ సీట్ల కేటాయింపులో విభేదాలు కూడా ఆ రెండు పార్టీల మధ్య పొత్తు అవకాశాలను దూరంచేశాయి.పార్టీ జాతీయ స్థాయి సామర్థ్యంతోనే సీట్లు కేటాయించాలే తప్ప ప్రాంతీయ పార్టీ బలంపై కాదని కాంగ్రెస్ పార్టీ వాదిస్తూ వచ్చింది.

 కాంగ్రెసు కారణాలు ఇవీ..

కాంగ్రెసు కారణాలు ఇవీ..

ఇటు కాంగ్రెస్, అటు సమాజ్ వాదీ పార్టీలోనూ యువతరానికి ప్రతినిధులు రాహుల్ గాంధీ, అఖిలేశ్ యాదవ్. వారిద్దరూ తమ పార్టీల నియంత్రణపై పట్టు సాధించే పనిలో ఉన్నారు. సమాజ్ వాదీ పార్టీలోని రెండు గ్రూపులు, కాంగ్రెస్ పార్టీకి ‘బ్రాండ్ అఖిలేశ్' సామర్థ్యం తెలుసు. రాజకీయంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని కుల, మతాల ద్రుక్కోణం నుంచి అభివ్రుద్ది దిశగా ముందుకు నడిపించే శక్తి ‘బ్రాండ్ అఖిలేశ్' ఇమేజ్ కు ఉన్నదన్న సంగతి ఆ రెండు పార్టీల్లోని సీనియర్లకు తెలుస్తుంది. రెండు పార్టీల మధ్య గతంలో గల విశ్వాస రాహిత్యాన్ని తగ్గించుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. యువతరం నేతల్లో అభిప్రాయాలు తేలిగ్గా కలిసిపోతాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా యూపీలో పట్టు సాధించాలంటే ఒంటరిగా మాత్రం అసాధ్యం కనుక అఖిలేశ్ సారథ్యంలో కలిసి పనిచేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక 2019లో ప్రధాని నరేంద్రమోదీని తిరిగి అధికారం చేపట్టకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడ. వచ్చే లోక్‌సభ ఎన్నికలు యుపిఎ, ఎన్డీఏ మధ్య ముఖాముఖీ జరుగుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కనుక యూపీలో బిజెపి తిరిగి పుంజుకునే అవకాశం లేకుండా ఉండాలంటే బలమైన పార్టీ మద్దతు కాంగ్రెస్ పార్టీకి అవసరం.

 పివి హయాంతో ఇలా..

పివి హయాంతో ఇలా..

గతంలో బిఎస్ పి వ్యవస్థాపక అదినేత కాన్షీరాం, నాటి ప్రధాని పివి నర్సింహారావు 1996 ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య కుదుర్చుకున్న పొత్తు పనిచేయలేదు. 126 స్థానాలకు పోటీచేసిన కాంగ్రెస్ 33, 296 స్థానాల్లో పోటీచేసిన బిఎస్ పి 67 స్థానాల్లో మాత్రమే విజయం సాధించాయి. అప్పట్లో ఏ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ స్థానాలు దక్కక రాష్ట్రపతి పాలన అమలుచేశారు. కొన్ని నెలల సమయం తర్వాత ఆరు నెలల ప్రాతిపదికన తొలిసారి బిఎస్పి అధినేత మాయావతి గద్దెనెక్కారు.

 ఇవీ కారణాలు...

ఇవీ కారణాలు...

ముస్లింలందరిచేత ‘మౌలానా ములాయం' అని బిరుదు అందుకున్న ఎస్పీ వ్యవస్థాపకుడితో పోలిస్తే.. యువనేత మాత్రం కేవలం ప్రగతి గురించే మాట్లాడతారు. అయోధ్యలో ఇంటర్నేషనల్ మ్యూజియం నిర్మాణం కోసం శంకుస్థాపనచేసిన అఖిలేశ్.. ఘజియాబాద్‌లో ‘అలా హజరత్ హజ్‌హౌస్‌'ను ప్రారంభించారు. దేవాలయాలను సందర్శించే అఖిలేశ్.. బహిరంగంగానే సాధువుల దీవెనలు అందుకుంటారు. మసీదుల్లో ఇమామ్‌ల ఆశీస్సులు పొందుతారు.

 ఎస్పీలో తిరుగుబాటుపై సీనియర్లు..

ఎస్పీలో తిరుగుబాటుపై సీనియర్లు..

తన పాలన పట్ల ప్రజా వ్యతిరేకత ఉన్న సంగతి అఖిలేశ్ యాదవ్ కు తెలియంది కాదు. ములాయం పాత్ర కూడా వచ్చే ఎన్నికల్లో దెబ్బతీసే అవకాశం లేకపోలేదు. ఉత్తరప్రదేశ్ లోని ములాయం కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తున్న ఎతావా, మెయిన్ పురి, కన్నౌజ్ జిల్లాల్లో తండ్రీ కొడుకుల ఘర్షణ పట్ల సీనియర్ ఓటర్లు దిగ్భ్రాంతికి గురయ్యారు. తండ్రికి వ్యతిరేకంగా కొడుకు అఖిలేశ్ యాదవ్ తిరుగుబాటు చేయడం జీర్ణించుకోలేకపోతున్నారు. ములాయంతో విభేదాల వల్ల కోల్పోయే ఓటును యువనేత పరిగణనలోకి తీసుకోవడం లేదు. దానికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు అఖిలేశ్ ఆసక్తిగా ఉన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి గ్రామగ్రామాన గణనీయ స్థాయిలో ప్రజల మద్దతు ఉన్నది. ఈ మద్దతు గల కాంగ్రెస్ పార్టీతో పొత్తు లాభిస్తుందని అఖిలేశ్ యాదవ్ అంచనా. తండ్రి ములాయం ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీని జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు అఖిలేశ్.

English summary
Samajwadi Party MP Dimple Yadav might have stayed in the shadows of her family seniors so far, but political insiders say that she might emerge as a force to reckon with in the upcoming Uttar Pradesh Assembly polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X