మోడీ నియోజకవర్గం వారణాసిలో గెలుపెవరిది?

అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రేపు (శనివారం) వెలువడనున్నాయి. ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడుతారు? బీజేపీ సత్తా చాటుతుందా? కాంగ్రెస్ గెలుస్తుందా? ఎగ్జిట్ పోల్ అంచనాలు ఏ మేరకు నిజమవుతాయి? అనే చర్చ సాగుతోంది

లక్నో: అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రేపు (శనివారం) వెలువడనున్నాయి. ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడుతారు? బీజేపీ సత్తా చాటుతుందా? కాంగ్రెస్ గెలుస్తుందా? ఎగ్జిట్ పోల్ అంచనాలు ఏ మేరకు నిజమవుతాయి? అనే చర్చ సాగుతోంది.

అన్ని రాష్ట్రాల కంటే ఉత్తర ప్రదేశ్ పైన అందరి దృష్టి ఉంది. అందులోను ప్రధాని మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి ఇంకా ప్రాధాన్యత సంతరించుకుంది. అక్కడ మోడీ పట్టు నిలుపుకుంటారా, విపక్షాలు ఆయనపై గెలుస్తాయా చూడాలి. 2014లో జరిగిన లోకసభ ఎన్నికల్లో బీజేపీ 80 స్థానాలకు 73 స్థానాల్లో గెలిచింది.

వారణాసిపై ఇప్పుడు పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. నోట్ల రద్దు ప్రభావం లేదని నిరూపిస్తూ, మోడీ హవా కొనసాగుతోందని చెప్పడానికి ఈ లోకసభ స్థానం పరిధిలోని ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో అధిక సీట్లు గెలుచుకోవడం బీజేపీకి కీలకం.

narendra modi

అందుకే మోడీ, అమిత్ షా వంటి వారు ఈ ప్రాంతంపైప్రత్యేక దృష్టి సారించారు.
మరోవైపు ప్రజల్లో నోట్ల రద్దుపై వ్యతిరేకత ఉందని చెప్పడంతో పాటు, అభివృద్ధి మంత్రాన్నే నమ్ముకున్న ఎస్పీ సైతం తనదైన శైలిలో ఇక్కడ ప్రచారం చేసింది.

వారణాసితో పాటు యూపీలో ఎక్కడ చూసినా అఖిలేశా, మోడీనా అన్న చర్చ జరుగుతోంది. యూపీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా భావించిన మోడీ ఈసారి రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు.

ముఖ్యంగా వారణాసి లోకసభ నియోజకవర్గంలో రెండు రోడ్ షోల్లోనూ, మూడు ప్రచార ర్యాలీల్లోనూ పాల్గొన్నారు. అయితే ఇక్కడ ఈసారి సాధారణం కంటే అధికంగా పోలింగ్‌ నమోదు కావడం ఏ పార్టీకి కలిసి వస్తుందనే చర్చ సాగుతోంది.

అయితే, మోడీ రాక ముందు పరిస్థితి వేరేగా ఉందని, ఆయన పర్యటన తర్వాత పరిస్థితిలో పూర్తిగా మార్పు వచ్చిందనే వాదనలు కూడా ఉన్నాయి. బీజేపీని ఎలాగైనా అడ్డుకోవాలని కలిసి పోటీ చేస్తున్న ఎస్పీ-కాంగ్రెస్‌ కూటమి అభివృద్ధి పేరుతో ఢీకొంది.

పైగా, రెండు పార్టీలు కలిసి పోటీ చేయడం వల్ల ప్రయోజనం ఉందని, దానికి తోడు అఖిలేశ్‌ చేపట్టిన అభివృద్ధి పనులు ఆ పార్టీ విజయానికి దోహదం చేస్తాయంటున్నారు. ముఖ్యంగా లక్నో, ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణం అందుకు ఓ నిదర్శనమంటున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో వారణాసి లోకసభ నియోజకవర్గ పరిధిలో ఉన్న 8 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 3, ఎస్పీ 2, బీఎస్పీ 2, కాంగ్రెస్‌ ఒక స్థానం కైవసం చేసుకున్నాయి. ఇప్పుడు బీజేపీ ఎక్కువ సీట్లపై ఆశలు పెట్టుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+