Atiq Ahmed: మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ దారుణహత్య: పోలీసులు చూస్తోండగానే బుల్లెట్ల వర్షం

లక్నో: లోక్‌సభ మాజీ సభ్యుడు అతిక్ అహ్మద్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటనలో అతని సోదరుడు అష్రాఫ్ అహ్మద్‌ కూడా మరణించారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో కొద్దిసేపటి కిందటే ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవలే అతిక్ అహ్మద్ కుమారుడిని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెలిసిందే.

అతని అంత్యక్రియలు ముగిసిన వేళ- అతిక్ అహ్మద్, అష్రాఫ్ అహ్మద్‌పై కాల్పులు చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ఘటనతో ప్రయాగ్ రాజ్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వారిద్దరినీ చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తోన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ కాల్పులకు తెగబడినట్లు పోలీసులు నిర్ధారించారు.

Atiq Ahmed

ఈ సమాచారం అందిన వెంటనే ప్రయాగ్ రాజ్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసు అధికారులు అప్రమత్తం అయ్యారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను ప్రయాగ్ రాజ్‌కు తరలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తక్షణ చర్యలు తీసుకుంటోన్నారు. కాల్పులు జరిగిన వెంటనే ప్రయాగ్ రాజ్‌లోని పలు ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి.

అతిక్ అహ్మద్ ప్రస్తుతం జైలులో ఉంటోన్నారు. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమైన తన కుమారుడు అసద్ అంత్యక్రియల్లో పాల్గొనడానికి ఆయన ప్రయాగ్ రాజ్‌కు చేరుకున్నారు. అంత్యక్రియల్లో పాల్గొన్న అనంతరం అష్రాఫ్ అహ్మద్ అనారోగ్యానికి గురయ్యాడు. దీనితో అతిక్ అహ్మద్ అతణ్ని ఆసుపత్రికి తీసుకెళ్తోండగా.. రాత్రి 10:30 గంటల సమయంలో ఈ కాల్పులు జరిపారు.

Atiq Ahmed

అత్యంత సమీపం నుంచి అంటే పాయింట్ బ్లాంక్ రేంజ్ నుంచి వారిద్దరిపైనా బుల్లెట్ల వర్షాన్ని కురిపించారు. పోలీసులు అందరూ చూస్తోండగానే వారిపై బుల్లెట్ల వర్షాన్ని కురిపించారు ఆ ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు. అతిక్ అహ్మద్ తలకు అతి సమీపం నుంచి కాల్పులు జరిపాడొకడు. ఆ వెంటనే అతను కుప్పకూలిపోయాడు. పక్కనే ఉన్న అష్రాఫ్ అహ్మద్‌పై కాల్పులు జరిపారు.

ఊహించని ఈ ఘటనతో పోలీసులు దూరంగా వెళ్లిపోయారు. నేలపై కుప్పకూలిన అతిక్ అహ్మద్, అతని సోదరుడిపై పలు రౌండ్లు కాల్పులు జరిపారు. వారు మరణించారని నిర్ధారించుకున్న తరువాతే అక్కడి నుంచి పారిపోయారు. మొత్తం ముగ్గురు వ్యక్తులు ఈ కాల్పులకు పాల్పడినట్లు ప్రయాగ్ రాజ్ పోలీసులు నిర్ధారించారు. వారిని అరెస్ట్ చేశారు.

ఈ ముగ్గురినీ అరెస్ట్ చేసే క్రమంలో ఎదురు కాల్పులు సైతం చోటు చేసుకున్నాయి. తమను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులపై హంతకులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మాన్ సింగ్ అనే కానిస్టేబుల్‌కు బుల్లెట్ గాయాలయ్యాయి. ఆయనను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్‌కు ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు నిర్ధారించినట్లు తెలుస్తోంది.

ఉమేష్ పల్ హత్యకేసులో ప్రధాన నిందితుడు అసద్. ఇటీవలే ఝాన్సీ వద్ద ఉత్తర ప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అతణ్ని ఎన్ కౌంటర్ చేశారు. అసద్‌తో పాటు అతని సన్నిహితుడు గులామ్‌ను కూడా కాల్చి చంపారు. ఈ ఘటన అనంతరం ఉత్తర ప్రదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాటి ప్రకంపనల తీవ్రత తగ్గకముందే ఇప్పుడు ఏకంగా అతిక్ అహ్మద్, అతని సోదరుడు హత్యకు గురికావడం కలకలం రేపుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+