షాక్: ఉత్తర్ ప్రదేశ్ పిసిసి చీఫ్ పార్టీకి రాజీనామా, రాహుల్ పై విమర్శలు
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకొన్న నేపథ్యంలో యూపి పిసిసి చీఫ్ రాజ్ బబ్బార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూట గట్టుకొన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నారు.ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సినీ నటుడు రాజ్ బబ్బర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ తో ఎన్నికల పొత్తును కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాజ్ బబ్బర్ తీవ్రంగా వ్యతిరేకించారు.అయితే బిజెపికి చెక్ పెట్టేందుకుగాను కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు ఈ ఎన్నికల్లో కలిసి పోటీచేశాయి.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర పరాజయాన్ని చవిచూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై పార్టీ నాయకులు విమర్శలను గుప్పిస్తున్నారు. సరైన వ్యూహరచన చేయకపోవడం వల్లే పార్టీ ఐదు రాష్ట్రాల్లో కోలుకోలేని దెబ్బతిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కొందరు రాహుల్ ను సమర్థిస్తున్నారు. అయితే ఇతర రాష్ట్రాల్లో కూడ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇంచార్జ్ లు వ్యవహరించిన తీరుతో కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని దెబ్బతింది.

కాంగ్రెస్ పార్టీకి రాజ్ బబ్బర్ రాజీనామా
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీతో పొత్తును కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాజ్ బబ్బర్ తీవ్రంగా వ్యతిరేకించారు.ఈ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు ఘోర పరాజయం ఎదురైంది.అయితే ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాజ్ బబ్బర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ తీరును ఆయన తప్పుబట్టారు.రాహుల్ తీరును తప్పుబట్టారు.సరైన సమయంలో చర్యలు తీసుకోకుండా తాత్సారం చేశారని ఆయన ఆరోపించారు.రాహుల్ తీరును తప్పుబడుతూ ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

కాంగ్రెస్ వ్యూహ తప్పిదాలు
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహరచనల్లో ఘోరంగా వైఫల్యం చెందింది.కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించారు.కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సత్యవత్ర చతుర్వేది రాహుల్ నాయకత్వ పటిమపై ప్రశ్నలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ వ్యూహ తప్పిదాలే అంటూ ఆయన కాంగ్రెస్ పై విమర్శలు చేశారు.

పార్టీని వీడుతున్న నాయకులు
గోవాలో కాంగ్రెస్ పార్టీ అతి పెద్ద పార్టీగా అవతరించినా కాని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవడం కాంగ్రెస్ పార్టీ సీనియర్ల తప్పిదాలే అని ఆ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు ఆరోపణలు చేస్తున్నారు. గోవాల బిజెపి కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించినా కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం దక్కలేదు. బిజెపి నేతృత్వంలో గోవాలో ప్రభుత్వం ఏర్పాటు కావడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీని వీడేందుకు సిద్దమయ్యారు.గోవా నాయకుల బాటలోనే యూపి నాయకుడు రాజ్ బబ్బార్ కూడ నిలిచారు.

యూపిలో కాంగ్రెస్ కోలుకోనేనా?
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్ వాదీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల తమకు కలిసివచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ భావించింది.సమాజ్ వాదీ పార్టీలో పొత్తు కాంగ్రెస్ పార్టీకి కలిసివస్తోందని భావించినా సాద్యం కాలేదు. దీంతో సమాజ్ వాదీ పార్టీకి కూడ కాంగ్రెస్ తో పొత్తు కలిసిరాలేదు. అయితే బిజెపి ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకుగాను ప్లాన్డ్ గా వ్యవహరించింది.యూపిలో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగుతున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తన ఉనికి కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని తనకు దూరమైన వర్గాలకు దగ్గరయ్యేలా కార్చాచరణను తీసుకొంటే తప్ప ఆ పార్టీకి యూపిలో భవిష్యత్ ఉండదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications