వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపీలో దారుణం : మహిళను కింద పడేసి... ఆమె మీద కూర్చొని దాడి చేసిన పోలీస్

|
Google Oneindia TeluguNews

ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళ పట్ల ఓ ఎస్సై వ్యహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేకాట ఆడుతున్నాడన్న ఆరోపణలతో ఆ మహిళ భర్తను పోలీసులు అరెస్ట్ చేయగా ఆమె అడ్డుపడింది. దీంతో రెచ్చిపోయిన ఎస్సై ఆమె పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. ఆమెను కింద పడేసి... ఆమె మీద కూర్చొని దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఘటనపై బాధిత మహిళ ఆర్తి మాట్లాడుతూ... పేకాట ఆరోపణలతో తన భర్తను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. అతన్ని విడిచి పెట్టాలంటే లంచం ఇవ్వాలని ఎస్సై డిమాండ్ చేశారని... అందుకు తాము నిరాకరించడంతో తమపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. 'అతను నన్ను చెంపదెబ్బ కొట్టాడు. ఆపై నన్ను ఈడ్చుకెళ్లి కింద పడేశాడు. నా మీద కూర్చొని దారుణంగా కొట్టాడు. మధ్యలో మా గ్రామస్తులు జోక్యం చేసుకుని నన్ను కాపాడారు...' అని వాపోయారు.

 uttar pradesh police attacked a woman he dragged and sat on her to hit

మరోవైపు పోలీసుల వాదన భిన్నంగా ఉంది. కాన్పూర్ ఎస్పీ కేశవ్ చౌదరి మాట్లాడుతూ... ఆర్తి భర్త యాదవ్ అతని స్నేహితులు పేకాట ఆడుతుండగా పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు. వారిని అదుపులోకి తీసుకునే క్రమంలో యాదవ్ భార్య ఆర్తి,అతని తల్లి ఎస్సై పటేల్‌కు అడ్డుపడ్డారని చెప్పారు. ఈ క్రమంలో ఆర్తి కిందపడిపోయిందన్నారు. యాదవ్‌ను అక్కడినుంచి పారిపోయేలా చేసేందుకే వారు అడ్డుపడ్డారని ఎస్సై భావించినట్లు చెప్పారు. ఈ క్రమంలో స్వల్ప ఘర్షణ జరిగిందన్నారు. ఘటనపై విచారణకు ఆదేశించామని... స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి ఇన్‌చార్జిగా ఎస్సై పటేల్‌ను తప్పించామని చెప్పారు.

ఇదే ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ... మహిళపై దౌర్జన్యం చేసిన ఆ పోలీస్ అధికారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇప్పటికే యూపీలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు,నేరాలు రాష్ట్రంలో మహిళా భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో నిత్యం మహిళలపై అత్యాచార ఘటనలు నిత్యకృత్యమైపోయాయి. పోలీస్ అధికారులు సైతం మహిళల పట్ల ఇలా దాడులకు పాల్పడటంపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

English summary
Kanpur Dehat superintendent of police Chowdhary said that Patel felt that Yadav's family was helping him flee and wrongly accused the official. Chowdhary said that an inquiry has been ordered and further action would be taken on the basis of the findings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X