అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి అదృశ్యం, సమాజ్ వాదీకి సుప్రీం షాక్?
అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి గాయత్రి ప్రజాపతి మంగళవారం నుండి అదృశ్యమయ్యారు. మంగళవారం నాడు పోలీసులు ఆయన ఇంట్లో సోదాలునిర్వహించారు. త్వరలోనే మంత్రిని అరెస్టు చేస్తామని పోలీసులు ప్రకటించారు.
లక్నో:అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర మంత్రి గాయత్రి ప్రజాపతి మంగళవారం నుంది అదృశ్యమయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మంగళవారం నాడే పోలీసులు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. త్వరలోనే ఆయనను అరెస్టు చేస్తామని పోలీసులు ప్రకటించిన నేపథ్యంలో మంత్రి కన్పించకుండా పోవడం ప్రాధాన్యతను సంతరించుకొంది.
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మంత్రివర్గంలో గాయత్రి ప్రజాప్రతి మంత్రిగా ఉన్నారు.తనతో పాటు తన మైనర్ కూతురుపై గాయత్రి ప్రజాపతి ఆయన అనుచరులు అత్యాచారం చేశారని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది.అయితే ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు మాత్రం కేసు నమోదు చేసేందుకుగాను ముందుకు రాలేదు.
అయితే బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయమై నివేదిక అందించాలని కూడ సుప్రీంకోర్టు ఆదేశించింది.దీంతో పోలీసులు ఆఘామేఘాల మీద చర్యలకు ఉపక్రమించారు.

మంగళవారం నాడు మంత్రి ఇంట్లో సోదాలు నిర్వహించారు. త్వరలోనే మంత్రిని అరెస్టు చేస్తామని పోలీసులు ప్రకటించారు.ములాయం సింగ్ యాదవ్ అత్యంత సన్నిహితుడుగా ఉన్నందునే గాయత్రి ప్రజాపతిని అఖిలేష్ తన క్యాబినెట్ లోకి తీసుకొన్నారు.
బిజెపి గాయత్రి ప్రజా పతి వ్యవహరాన్ని తీవ్రంగా ప్రచారం చేసింది.ప్రధానమంత్రి నరేంద్రమోడీ గాయత్రి ప్రజాపతి పేరును ప్రస్తావిస్తూ సమాజ్ వాదీ పార్టీపై విమర్శలు గుప్పించారు.అయితే సమాజ్ వాదీ పార్టీ ఎన్నికల ప్రచార సభల్లో గాయత్రి ప్రజాపతితో కలిసి వేదిక పంచుకోకుండా ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ జాగ్రత్తలు తీసుకొన్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు మంత్రి గాయత్రి ప్రజా పతి ఇంట్లో మంగళవారం సోదాలు నిర్వహించారు.అయితే అప్పటి నుండి మంత్రి అదృశ్యమయ్యారు. అరెస్టు చేస్తామని పోలీసులు ప్రకటించిన నేపథ్యంలో గాయత్రి ప్రజాపతి అదృశ్యం కావడం ప్రాధాన్యతను సంతరించుకొంది.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications